Jagan Misleading People: కుప్పం ప్రజలకు 14 వేల కోట్ల రూపాయలు ఇచ్చానన్న సీఎం జగన్.. ఈ మాటలు నమ్మేలా ఉన్నాయా?

Jagan Misleading People: వై నాట్ 175.. వై నాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత ప్రచారం చేస్తున్నారు. వై నాట్ 175 అంటున్న జగన్ కు ఆ పరిస్థితి ఉందో లేదో అందరికి తెలిసిన విషయమే. అత్తెసరు మెజారిటీతో గెలుపునకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, వై నాట్ కుప్పం అనే విషయానికి వస్తే.. చంద్రబాబును కుప్పంలో ఓడించడానికి జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. రెండేళ్లగా కుప్పంలో ఆపరేషన్ మొదలు పెట్టారు. బెదిరించి, భయపెట్టి టీడీపీ శ్రేణులను వైసీపీలో చేర్చుకున్నారు. చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డిని రంగంలోకి దించారు. ఆయన అక్కడ సామదానభేదదండోపాలు ప్రయోగిస్తున్నారు. దొంగఓట్లు క్రియేట్ చేయడం, వాలంటీర్లను ప్రయోగించడం అన్ని అస్త్రాలను సిద్దం చేసుకున్నారు. వైసీపీ అరాచకాలను చూసిన కుప్పం ప్రజలు ఆ పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ నీటిని కుప్పానికి విడుదల చేశాయి. వైసీపీ అధినేతకు ఓ అలవాటు ఉంది. ప్రజలకు ఒక్క రూపాయి ఇచ్చి.. పది రూపాయలు తీసుకోవడం. దానితో పాటు.. పది రూపాయలు పని చేసి 100 రూపాయలు ప్రచారం చేసుకోవడం. ఈ అలవాట్లు ఏపీ సీఎం జగన్‌కు బాగా ఎక్కువ. అందులో భాగంగానే కుప్పానికి నీటిని విడుదల చేస్తూ ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా చేశానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ఐదేళ్లకు 14 వేల కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. పద్నాగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి చేసిందేమీ లేదని.. తానే మొత్తం చేశారని అన్నారు. 35 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నియోజవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరో రెండు రిజర్వాయర్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్ననని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మరి జగన్ చేసిన అభివృద్దిని చూసుకుంటే.. నిజంగా ఆస్థాయిలో ఉందా? రాష్ట అభివృద్ధికి ఆయన ఏం చేశారో చూస్తే కుప్పం కోసం ఏం చేశారో తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక బిల్డింగ్ కట్టింది లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు.

అలాంటిది 14 వేల కోట్లతో జగన్ నిజంగా కుప్పాన్ని అభివృద్ధి చేశారా? అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. మరి ఆయన చెప్పినట్టు చంద్రబాబు కుప్పానికి ఏం చేయలేదే అనుకుందాం? నిజంగా చంద్రబాబు ఏం చేయకుపోతే.. 35 ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారు? చంద్రబాబు అంటేనే అభివృద్ధి మార్క్ లా ఉంటారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కోసం గానీ.. ఇప్పుడు నవ్యాంధ్ర కోసం కానీ ఆయన విజనరీని విపక్షాలు సైతం ప్రశ్నంచలేరు. అలాంటిది చంద్రబాబు కుప్పం కోసం ఏం చేయలేదు అంటే అది కూడా నమ్మశక్యంగా లేదు.

ఇవన్నీ పక్కన బెడితే.. ఏ ఒక్క నియోజవర్గానికి కూడా ఐదేళ్లులో 14 వేల కోట్లు ఖర్చు చేయలేరు. అభివృద్ధి, సంక్షేమం కలిపినా కూడా 14 వేల కోట్లు ఖర్చు సాధ్యం కాదు. ఎందుకంటే.. జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఒక్కో నియోజవర్గానికి 14వేల కోట్ల చొప్పున.. 24 లక్షల 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర బడ్జెట్ అంతలేదు. ఏడాదికి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు చొప్పున వేసుకున్నా.. 12.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అవుతోంది. మరి మిగిలిన 12 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.

దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రతీ ఏడాది బడ్జెట్‌ రెండున్నర లక్షల కోట్లలో ఉద్యోగులు జీతాలు, సంక్షేమ పథకాలు కూడా అందులోనే ఉంటాయి. మరి ప్రత్యేకంగా కుప్పానికి 14 వేల కోట్లు ఖర్చు చేయడం ఎలా సాధ్యం అవుతోంది? దానికి సీఎం జగనే సమాధానం చెప్పాలి. మరి జగన్ చెబుతున్న 14 వేల కోట్ల రూపాయాల కథ సంగతి ఏంటీ అని ఆరా తీస్తే.. జస్ట్ ప్రాస కోసమే ఆయన అలా అన్నారని తెలుస్తోంది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఏం చేయకపోయినా.. నేను 14 వేల కోట్లు ఐదేళ్లలోనే ఖర్చు చేశానని చెప్పడానికి ఆ మాట అన్నారట. దీంతో… జగన్ ప్రాస కోసం పరువు తీసుకుంటారా?అని వైసీపీలోనే చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -