YS Jagan: టార్గెట్ ‘కాపు’.. పవన్ పై జగన్ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం అదేనా?

Cm Jagan – Pawan Kalyan: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే.. ఏపీ పాలిటిక్స్ ఇప్పుడే హీట్ పుట్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. తమ వ్యూహలకు ఇప్పటినుంచే పదును పెడుతున్నాయి. గెలుపు కోసం వ్యూహలను షురూ చేసే పనిలో పార్టీలన్నీ ఉన్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళుతున్న అధికార వైసీపీ.. మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చామని చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రతో పాటు ప్రస్తుతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

ఇలా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహలు రచిస్తున్నారు. అధికార వైసీపీ మరోసారి పీకే టీమ్ ను నియమించుకుని ఎన్నికలను ఎదుర్కొనుంది. టీడీపీ, జనసేన మాత్రం సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నాయి. తమ సొంత అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. అధికార వైసీపీ మాత్రం పీకే టీమ్ వ్యూహాలను అమలు పరుస్తోంది.

సామాజిక వర్గాల వారీగా ఇప్పటినుంచే ఓట్లర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓటర్లలో ఎక్కువ శాతం మంది వీళ్లే ఉన్నారు. దీంతో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. కాపు సామాజికవర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తూ ఉంటాయి. వీరిని ఆకర్షించేందుకు అనేక హామీలు ఇస్తూ ఉంటాయి. తమ సామాజికవర్గమైన కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇటీవల పవన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. పలు సందర్భాల్లో కాపు సామాజికవర్గం గురించి ప్రస్తావించారు.

కాపు సామాజిక వర్గాన్ని గుంపగుత్తగా తన వైపు తిప్పుకునేందుకు పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. తమ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికార వైసీపీ అప్రమత్తమైంది. కాపు ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు వ్యూహలకు పదును పెట్టింది. ఇటీవల కాపు సామాజికవర్గం ఓటర్లపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లు అందులో భాగమేననే ప్రచారం పొలిటికల్ కారిడార్ లో జోరుగా జరుగుతోంది.

ఇటీవల కాకినాడలో కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పై విరుచుకుపడ్డారు. కాపు సామాజికవర్గ ఓట్లను మూటకట్టి చంద్రబాబుకు అమ్మేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడితో జాగ్రత్తగా ఉండాలని జగన్ విమర్శలు చేశారు. జగన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. కాపు ఓటర్లను దగ్గర చేసుకోవడంలో భాగంగానే జగన్ కామెంట్ చేశారని టాక్ వినిపిస్తోంది.

కాపులు పవన్ కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లేననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే జగన్ అలా వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. పవన్ కు బలం కూడా ఉభయగోదావరి జిల్లా ప్రజలే. ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఏపీ రాజకీయాల్లో బలంగా ఉంది. 2014, 2019 ఎన్నికలు కూడా ఆ సెంటిమెంట్ ను నిజం చేశాయి. మరోసారి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకోవాలనే యోచనలో వైసీపీ ఉంది.

అందులో భాగంగా టార్గెట్ కాపు అస్త్రాన్ని వైసీపీ ప్రయోగించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే చంద్రబాబు, పవన్ ను విమర్శిస్తూ జగన్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కాపు ఓటర్లు పవన్ ను నమ్మవద్దని జగన్ వ్యాఖ్యల వెనుక బలమైన కారణం ఇదేననే ఊహాగానాలు ఏపీ పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి. మరి కాపు ఓటర్లు ఎటువైపు ఉంటారు? పవన్ కు కాపు కాస్తారా? చంద్రబాబు వైపు చూస్తారా? లేక అధికార వైసీపీ వైపే మొగ్గు చూపుతారా? అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -