RGV-CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన రాంగోపాల్ వర్మ.. బాబుకు వ్యతిరేకంగా మరో సినిమాకు ప్లాన్?

RGV-CM Jagan: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సీఎం జగన్‌తో భేటీ కావడం షాకింగ్‌గా మారింది. బుధవారం తాడేపల్లిలో ఒక్కసారిగా రాంగోపాల్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన కనిపించడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. క్యాంపు కార్యాలయంలో జగన్‌ను రాంగోపాల్ వర్మ కలిశారు. సీఎం జగన్ తో రాంగోపాల్ వర్మ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాంగోపాల్ వర్మ అనూహ్యంగా జగన్ ను కలవడంపై జోరుగా చర్చ జరుగుతోుంది. జగన్ ను ఎందుకు కలిశారనేరది హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ ను ఇప్పుడు సడెన్ గా కలవాల్సిన అసవరం ఏంటని రాజకీయ, సినీ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో జగన్ ను ఆర్జీవీ కలవడం వెనుక ఆంతర్యం ఏమటన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ నుంచే రాంగోపాల్ వర్మకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. తనను వచ్చి కలవాల్సిందిగా ఆర్జీవీకి జగన్ ఆహ్వానం పంపారని, అందులో భాగంగానే ఆర్జీవీ వచచి జగన్ తో భేటీ అయినట్లు చెబుతున్నారు. ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీని దెబ్బతీసేందుకు జగన్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తోన్నారు. నేతలను ఇప్పటినుంచే ఎన్నికల కోసం సిద్దం చేస్తోన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్జీవీని జగన్ పిలవడం వెనుక కారణం ఏంటనే దానిపై అనేక చర్చలు జరుగుతుననాయి.

గత ఎన్నికల్లో రాంగోపాల్ వర్మ సేవలను వైసీపీ ఉపయోగించుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను ఆర్జీవీతో కలిసి వైసీపీ నేతలు తెరకెక్కించారు. ఎన్టీఆర్ వెన్నుపోటు అంశాలతో పాటు ఎన్టీఆర్ చేతిలో నుంచి చంద్రబాబు పార్టీలోకి ఎలా వచ్చింది.. లక్ష్మీపార్వతి పాత్ర ఏంటనే దానిపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆర్జీవీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా వైసీపీ నేత నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మిపార్వతికి సపోర్టుగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆ సినిమా తెరకెక్కింది. యుగపురుషుడు, మహానాటుడి పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ ను నందమూరి నటసింహం బాలకృష్ణ తెరకెక్కించగా.. దానికి పోటీగా ఆర్జీవీతో కలిసి వైసీపీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు, లోకేష్ ను కించపరుస్తూ పాటలు, పాత్రలు రూపొందించారు. ఆ సినిమా ద్వారా చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేసింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో చంద్రబాబును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ ప్రచారం నిర్వహించారు. ఇన్ డైరక్టుగా వైసీపీకి అనుకూలంగా గత ఎన్నికల్లో రాంగోపాల్ వర్మ పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జగన్ నుంచి ఆర్జీవీకి మరోసారి పిలుపు రావడం వెనుక వ్యూహం ఉంటనేది పొలిటికల సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లోలాగే ఈ ఎన్నికల్లో కూడా ఆర్జీవీ సేవలను ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఆర్జీవీ ఓ అస్త్రంగా వాడుకోనున్నారనే చర్చ టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. లేకపోతే ఆర్జీవీతో జగన్ ను ఏం పని ఉంటుందని టీీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

జగన్ కు యాంటీగా మళ్లీ ఆర్జీవీ షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ లేదా సినిమా తీస్తారని టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తోన్నాయి. ప్రస్తుతం ఏపీలో పవన్, చంద్రబాబు కలిసి పనిచేసేందుకు సిద్దమవతున్నారు. పవన్ అంటే ఆర్జీవీకి అసలు నచ్చదు. ఇటీవల వైసీపీ నేతలపై పవన్ రెచ్చిపోతుననారు. చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఆర్జీవీని జగన్ ఉపయోగించుకుంటారని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -