CM KCR: బీఆర్ఎస్‌పై రంగంలోకి కేసీఆర్.. ఢిల్లీలో కీలక సమావేశాలు

CM KCR: దసరా రోజున సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పార్టీ నేతల సందడి మధ్య బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలని కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. అందుకే త్వరలో కొన్ని రాష్ట్రాల్లో పర్యటించే అవకాకశముందని, బహిరంగ సభలు నిర్వహించే అవకాశముంది. త్వరలో ఏపీలోని విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలోని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

అయితే దేశవ్యాప్తంగా పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుుకుంది. మంగళవారం యూపీ నుంచి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. వారం రోజుల పాటు హస్తినలోనే మకాం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాలతో అసలు సంబంధం లేని తటస్తులను కేసీఆర్ కలుస్తారనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పాలన గురించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని టాక్ నడుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్న చిన్న పార్టీలతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయం గురించి చర్చిస్తారనే చర్చ నుడుస్తోంది.

అలాగే చిన్న పార్టీలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడంపై కేసీఆర్ దృష్టి పెట్టనున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన మీడియా ప్రతినిధులతో కేసీఆర్ ప్రకటించలేదు. ఆ రోజు సాయంత్రం మీడియా సమవేశం ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజీ పనుల వల్ల కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో ఢిల్లీలో నేషనల్ మీడియాతో కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిసారి బీఆర్ఎస్ తరపున ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడతారనే సమాచారం వస్తోంది.

అియితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడైన అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేయడం తెలంగాణలో సంచలనం రేపుతోంది. మూడు రోజుల పాటు ఆయనను సీబీఐ కస్టడీలోకి తీసకుని ప్రశ్నించింది. అభిషేక్ రావు నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. ఎలాంటి నోటీసులు అందించకుండానే, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు పెట్టకుండానే సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అనూహ్య పరిణామం బీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది. విచారణలో సీబీఐకి అభిషేక్ రావు ఏ ఏ విషయాలను బయటపెడతారనేది చర్చనీయాంశంగా మారింది. అాలాగే టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావు సన్నిహితుడైన వెన్నమనేని శ్రీనివాసరావుపై కూడా ఇప్పటికే ఈడీ దాడులు చేపట్టింది.

శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారంర. శ్రీనివాసరావుపై ఈడీ సోదాలు జరపడం, అభిషేకర్ రావును సీబీఐ అరెస్ట్ చేయడం కవిత వర్గంలో ఆందోళన మొదలైంది. వీరిద్దరూ టీఆర్ఎస్ నేతలకు సన్నిహితులు కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -