KCR-Jagan: జగన్ ను ఫాలో అవుతున్న కేసీఆర్.. వారిని ఇక వదిలిపెట్టరా?

KCR-Jagan: రాజకీయాలకు, సినిమాలకు చాలా అనిభావ్య సంబంధం ఉంటుదంటారు. రాజకీయ నాయకులు ప్రజల దగ్గర నటించి ఆకట్టుకుంటే.. సినీ నటులు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకర్షిస్తారని చెబుతుూ ఉంటారు. రాజకీయ నాయకులు, సినిమా నటులు ఒక్కటేనని సెటైర్లే వేస్తూ ఉంటారు. ఇక సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వారు దేశంలో చాలామంది ఉన్నారు. ఇక ప్రజాప్రతినిధిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్న వారు కూడా దేశంలో చాలామందే ఉన్నారు. దీంతో రాజకీయాలు, సినిమాలకు సంబంధం ఉంటుంది. రాజకీయ పార్టీలు తమ పార్టీకి సినీ గ్లామర్ ను పెంచుకునేందుు సినీ నటులు, నటీమణులను ఆహ్వానిస్తూ ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి.

సినీ నటులు, నటీమణులకు ప్రజల్లో ఉన్న క్రేజ్ తమకు కలిసి వస్తుందని పార్టీలన్నీ భావిస్తాయి. అందుకే సెలబ్రెటీలను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది. దేశంలోని సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రెటీలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో పలువురు సినీ,క్రీడా, వ్యాపార ప్రముఖులు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నార్త్ ఇండియాలో బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు క్రీడా ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలందరూ బీజేపీ వైపే ఉన్నారు. సౌత్ ఇండియా బలపడాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాది సెలబ్రెటీలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా రజనీకాంత్ ను అడ్డుపెట్టుకుని సౌత్ లో బలపడాలని మోదీ ప్లాన్ చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు.

దీంతో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ సినీ రయియిత విజయేంద్రప్రసాద్, హీరో నితిన్, టీమిండియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిధాలీ రాజ్ లతో పాటు మరికొంతమందిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ పాపులర్ అయ్యాడు. దీంతో ఎన్టీఆర్ ను ఆకర్షించడం ద్వారా సౌత్ ఇండియాలో ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. సినీ గ్లామర్ పై బీజేపీ ఫోకస్ పెట్టడంతో దానికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ బాటలో కేసీఆర్ నడవనన్నారనే ప్రచారం సాగుతోంది.

తమకు నచ్చని అమిత్ షాతో భేటీ అయినందుకే ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తు్న్న బ్రహ్మాస్త్ర ఫ్రి రిలీజ్ పంక్షన్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి రాకుండా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో హైసెక్యూరిటీ ఉంటుంది. అనుమతి లేనిది అసలు ఎవరినీ లోపలికి వెళ్లనివ్వరు. పాస్ ఉంటేనే ఎవరినైనా అనుమతిస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలామంది ఉంటారు. అది కూడా నగర శివార్లలో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. సినిమా ఫంక్షన్లకు లా అండర్ ఆర్డర్ సమస్య ఏమీ ఉండదు. అలాంటప్పుడు సెక్యూరిటీ కారణాలను చూపి ఎలా అనుమతి నిరాకరిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సినిమా ఫంక్షన్లకు అనుమతి నిరాకరించిన సంఘటనలు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా లేదు.

కానీ మొదటిసారి సెక్యూరిటీ కారణంగా బ్రహ్మాస్త్ర సినిమాకు అనుమతి నిరాకరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ పై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, అందుకే చర్యలు మొదలుపెట్టాలనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు. దీంతో జగన్ తరహాలో సినిమా ఇండస్ట్రీపై త్వరలో కేసీఆర్ గురి పెడతారని, ఇబ్బందులకు గురి చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి సినిమా ఇండస్ట్రీని జగన్ ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఫార్ములా వాడతారా అనేది చర్చనీయాంశమవుతోంది.

ప్రభాస్ ఇప్పటికే బీజేపీకి సపోర్ట్ అనే ప్రచారం ఉంది. పెద్దనాన్న కృష్ణంరాజు బీజేపీలో ఉండటంతో ప్రభాస్ కూడా బీజేపీకి మద్దతుదారుడిగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇక విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ పదవి ఇవ్వడంతో ఆయన బీజేపీ అని తేలిపోయింది. ఇక జీవిత రాజశేఖర్ లాంటి కొంతమంది బీజేపీలో కొనసాగుతున్నారు. దీంతో బీజేపీకి సపోర్ట్ గా ఉన్న సినీ సెలబ్రెటీలపై కేసీఆర్ కన్నెర్ర చేస్తారని, భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మరి జగన్ ను కేసీఆర్ ఫాలో అవుతారా.. సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడతారా.. అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -