BRS Manifesto 2023: రూ.400కే గ్యాస్ బండ.. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలు అమలవ్వడం సాధ్యమేనా?

BRS Manifesto 2023: త్వరలోనే తెలంగాణలో శాసనసభ ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టోల రూపంలో ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చారు అయితే వీటితోపాటు వచ్చే ఎన్నికలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సరికొత్త పథకాలు కూడా బడుగు బలహీన వర్గాల వారు అగ్రవర్ణ పేదలు కూడా అందుకోవచ్చుని ఈయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆదివారం పార్టీ నేతలతో ముచ్చటించిన అనంతరం తన ఎన్నికల మేనిఫెస్టోని కూడా విడుదల చేశారు.

ఈ మేనిఫెస్టోలో భాగంగా దళితుల నుంచి మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకు ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలుగా మేలు చేసేలా మేనిఫెస్టో రూపొందించారు. ప్రస్తుతం అందుతున్నటువంటి ఆసరా పింఛన్ 5000 నుంచి దశలవారీగా 16 వేలకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఇక ప్రతి ఒక్కరు కూడా రేషన్లో ఇకపై సన్న బియ్యం పొందవచ్చు అలాగే ప్రతి కుటుంబంలోని ఒకరికి ప్రీమియర్ బీమా చెల్లించనున్నారని ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మరణిస్తే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.

అర్హులైనటువంటి వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అలాగే అక్రవర్ణ పేదలకు గురుకులాలు, ఏ సైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు ఇలా సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటించడం గమనార్హం. ఇక తమ ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే కేవలం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ విధంగా కేసీఆర్ మేనిఫెస్టో విడుదలచేస్తూ తెలంగాణ ప్రజలకు వరాల జల్లుల కురిపించారు.

ఇలా కేసీఆర్ మేనిఫెస్టోని విడుదల చేయడంతో పలువురు ఈ మేనిఫెస్టోపై సంతోషం వ్యక్తం చేయగా మరి కొందరు ఈయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరడం సాధ్యమేనా ఇలా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తర్వాత వాటి ప్రస్తావనకు తీసుకు వస్తారా వాటిని సక్రమంగా అమలు పరస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గత పది ఏళ్ల కాలంలో తెలంగాణలో ఏ విధమైనటువంటి గొడవలు అల్లర్లు లేకపోవడంతో తెలంగాణ ప్రజలకు ఈయన సెల్యూట్ చేస్తూ ఇకపై కూడా ఇలాగే శాంతియుతంగా ఉండాలని కోరారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -