CM KCR: ఒకే రోజు రెండు కీలక సమావేశాలు.. ముందస్తు ఎన్నికల దిశగా కేసీఆర్ అడుగులు?

CM KCR: తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికల టాపిక్ తెరపైకి వచ్చింది. ముందస్తు ఎన్నికల దిశగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దానికి కారణం ఒకేరోజు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు కేబినెట్ మీటింగ్ జరగనుండటమే. ఒకే రోజు రెండు కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే నెల మూడో తేదీన టీఆర్ఎస్ లేసిస్టేటివ్ సమావేశం తెలంగాణలో జరగనుండగా.. అదే రోజు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఒకేరోజు రెండు కార్యక్రమాలు సాధారణంగా ఏర్పాటు చేయరు. వేరే రోజుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే రోజు రెండు సమావేశాలు ఏర్పాటు చేయడంతో చర్చనీయాశంగా మారింది.

ముందస్తు ఎన్నికల కోసమే ఒకేరోజు రెండు సమావేశాలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీనిని బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారా అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముందస్తు ఎన్నిలకపై నేతలతో చర్చించి కేసీఆర్ ఓ తుది నిర్ణయానికి రానున్నారని వార్తలు వస్తున్నాయి.

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం కేబినెట్ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. జిల్లాల్లో టీఆర్ఎస్ భవనాలు ప్రారంభించడంతో పాటు ప్రతి జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్బంగా బహిరంగ సభలు నిర్వహించి మోదీ సర్కార్, బీజేపీపై మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతున్నారు. ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ లో ఎక్కువగా ఉండే కేసీఆర్.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తిరుగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే.. కేంద్రంలోని బీజేపీ ఆమోదిస్తుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తే కేసీఆర్ కు ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారు లేదా అనేది అనుమానంగా కనిపిస్తోందని మరికొందరు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -