BRS Manifesto : తెలంగాణ ప్రజలకు అదిరిపోయే తీపికబురు.. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ఇదేనా?

BRS Manifesto :ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ సీఎం టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలకమైన నిర్ణయాలతో కదనరంగంలోకి దిగుతున్నారు. అయితే ప్ర‌భుత్వ‌ ప‌రంగా ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న కేసీఆర్ గులాబీ ద‌ళ‌ప‌తి హోదాలో రాబోయే ఎన్నిక‌ల‌కు ఎలాంటి హామీలు ఇవ్వ‌నున్నార‌నే విషయం ప్రస్తుతం స‌హ‌జంగానే ఉంటుంది. ఆ ఉత్కంఠ‌ను బ్రేక్ చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల 16న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వ‌హించి మేనిఫెస్టో ప్రకటించ‌నున్నారు. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌, సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు వెల్ల‌డించారు.

టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగల్ లో మంత్రి హ‌రీశ్ రావు ప‌ర్య‌టిస్తున్నారు. నియోజకవర్గం ప‌రిధిలోని కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులు ప్రారంబించిన మంత్రి హరీష్ రావు ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చేయ‌ట్లేద‌ని గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకున్నారని హ‌రీశ్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక కోస్గిలో 50 పడకలు, మద్దూరులో 30 పడకల ఆస్పత్రిని నిర్మించామని తెలిపారు. పది సంవత్సరాలలో రేవంత్ ఒక్క దవాఖన తేలేదని, కానీ బీఆర్ఎస్ పాల‌న‌లో మూడు ఆస్పత్రులు వచ్చాయని గుర్తు చేశారు.

నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన అనంత‌రం ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చి దాహం తీర్చారని గుర్తు చేస్తూ రేవంత్ ఉంటే ఇంకా పదేండ్లు అయిన నీరు రాకపోయేదని హ‌రీశ్ రావు తెలిపారు. మ‌ళ్లీ గెలిపిస్తే కృష్ణమ్మ నీళ్లతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ పాదాలు తడుపుతామని హామీ ఇచ్చారు. అలాగే మూడు గంటల కరెంట్ కావాలి అంటే రేవంత్ కు 24 గంటల కరెంట్, పాలమూరు నీరు కావాలి అంటే నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని హ‌రీశ్ రావు పేర్కొన్నారు. రేవంత్ కు ఓటేస్తే కైలాసంలో పెద్ద పాము మింగినట్టేన‌ని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ తప్పు చేసినందున విచారణ జరపాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఓటు కు నోటు ఉదంతాన్ని హ‌రీశ్ రావు గుర్తు చేశారు. అలాగే త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుందని పేర్కొంటూ అందులో మహిళలకు శుభవార్త ఉంటుందన్నారు. బీఆర్ఎస్‌ మేనిఫెస్టో ప్రత్తిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని పేర్కొన్నారు హరీష్ రావ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -