CM KCR: తెలంగాణలో దొరల నుంచి పదవి దొర్లిపోనుందా.. 2024 ఎన్నికల్లో జరగబోయేది ఇదేనా?

CM KCR:  తెలంగాణ, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఏర్పడిన ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది తమ జీవితాలని బలి పెట్టారు. అయితే ఆఖరికి కేసీఆర్ నాయకత్వం తో తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలకి ఆయన ఒక దేవుడు అయ్యాడు. అతని పాలనలో తమ బ్రతుకులు బాగుపడతాయని ఆశపడ్డారు.తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందుకు పండగ చేసుకున్నారు.

ఇదంతా జరిగే 10 ఏళ్లు అయ్యింది. ఈ పదేళ్లు కేసీఆర్ నిర్విరామంగా రాష్ట్ర పాలన చేస్తూనే ఉన్నాడు. అయితే పదేళ్లు దాటినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత రాలేదా.. లేకపోతే కేసీఆర్ లాంటి తెలంగాణ జాతిపితకి ఇలాంటి వ్యతిరేకతలు వర్తించవా.. అసలు పదేళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉంది ఒకసారి చూద్దాం. నిజానికి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ హైదరాబాదు రూపులేఖలు మారిపోయాయి. ఇప్పుడు పశ్చిమ హైదరాబాద్ పశ్చిమ దేశాలని తలపిస్తోంది.

కేటీఆర్ తన వాగ్దాటితో భాషా పరిజ్ఞానంతో ఆకట్టుకుంటూ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక సమాధానం గా కనిపించడం సాలుకూల విషయం, కేసీఆర్ పాలనలో వచ్చిన మెట్రో రైల్ జనాలకి కొత్త సుఖాన్ని ఇచ్చింది. మీడియాలో పాలను పట్ల ప్రతికూల వార్తలు కనబడవు. అలాగే ఎక్కడ మత కలహాలు, టెర్రరిజం భయాలు లేకుండా శాంతిభద్రతలతో ఉన్నారు. అదే సమయంలో మరో కోణంలోంచి చూస్తే కేసీఆర్ సామాన్య జనానికి అందుబాటులో ఉండకపోవడం దొరలాగా ఎక్కడో కూర్చోవడం, మీడియా వారికి మాత్రమే దర్శనం ఇవ్వడం ప్రజలకు నచ్చడం లేదు.

అర్హత గలవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు పంచగలిగినా చాలామందికి ఆ ఇల్లు చేరలేదు. దీనివల్ల లబ్ది పొందని అనేక మంది కేసీఆర్ అభిమానులు ఈసారి ఆయన పార్టీకి ఓటు వేసేందుకు సుముఖంగా లేకపోవడం ఆ పార్టీ ఆందోళన పడాల్సిన విషయం. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు భూకబ్జాలతో అడ్డంగా సంపాదించుకున్నారని అభిప్రాయం ప్రజలలో బాగా పెరిగిపోయింది. అలాగే రైతుబంధు తప్పితే మరి ఏ ఇతర సంక్షేమ పథకాలు లేవు. ఈ లాభనష్టాలను బ్యారేజీ వేసుకున్న తెలంగాణ ప్రజలు ఈసారి దొరని గద్దెనెక్కిస్తారో,లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -