CM KCR: సిలిండర్ పై 1000 రూపాయల సబ్సిడీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే!

CM KCR: ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు ఇచ్చే పథకాలను చూస్తూ ఉంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ప్రజలకి అలాంటి పథకాలను ఇస్తాము అని చెప్పేటప్పుడు ఆలోచించే స్టేట్మెంట్లు ఇస్తారా అనే ఒక డౌట్ ప్రజలకి వస్తుంది. అలాంటి పథకం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకీ ఏం జరిగిందంటే. కేసీఆర్ ఒక సిలిండర్ మీద వేయి రూపాయల సబ్సిడీ ఇస్తాడు అని ఒక ఆర్టికల్ చూసిన జనాలు తెల్ల మొహం వేశారు.

1000 రూపాయలు సబ్సిడీ అని వార్త రాసిన విలేకరి, పబ్లిష్ చేసిన ఓనర్, ఇలాంటి వార్తలను ఫస్ట్ బ్యానర్ లో వేసిన సంపాదకుడు ఏమి ఆలోచించకుండానే వేసేస్తారో ఏంటో అనుకుంటూ తలలు పట్టుకున్నారు. నిజానికి ఒక సిలిండర్ ధర 955. సబ్సిడీ వెయ్యి రూపాయలు అంటే మనకి ఫ్రీగా ఇవ్వటంతో పాటు ఉల్టాగా 45 రూపాయలు మనకే ఇస్తారన్నమాట. అసలు ఈ స్కీం ఏమైనా నమ్మశక్యంగా ఉందా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాంటి న్యూస్ లు చూసి మేము ఇలాంటి స్కీం లని పెట్టడం లేదని ఎవరు ప్రకటించారు కదా.

12 అబ్బురపరిచే పథకాలు అట. అంటే కాంగ్రెస్ సెక్స్ కొడితే కేసీఆర్ రెండు వరస సిక్సర్లు కొడతారని ఆంధ్రప్రభ ఘంటాపదంగా చెప్పేస్తుంది. ఇక్కడ జగన్ కి సాక్షి పేపర్ ఎలాగో, చంద్రబాబునాయుడు కి టీవీ 5 ఎలాగో అక్కడ కేసీఆర్ కి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ అలా తయారైంది. కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించినవి ఇలాంటి స్కీమ్ లే అని కేసీఆర్ అనుకున్నాడో ఏమో కానీ వాటిలో ఏ పథకము జరగకపోయినా కేసీఆర్ మీద నెగిటివ్ ఒపీనియన్ కి దారితీస్తుంది.

అయినా ఈ పథకాలని పక్కన పెడితే ఇన్నాళ్ళు తన పాలనను మెచ్చిన ఓటర్లు మళ్ళీ తనను గెలిపిస్తాడని ధీమా కేసీఆర్ లో కలగడం లేదా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఈ పథకాలను చూసిన కామన్ మ్యాన్ ఇలాంటి పేపర్ల వల్ల కేసీఆర్ కి లాభమా నష్టమా అనేది ఆయనే ఆలోచించుకోవాలి అంటున్నారు. మరి దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -