CM KCR: మునుగోడు ఉపఎన్నికలో గెలుపెవరిది? కేసీఆర్ సర్వేలో నిజమెంత?

CM KCR: ప్రస్తుతం అందరి దృష్టి మునుగోడు ఉపఎ న్నికలపై పడింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఉపఎన్నిక గురించి చర్చించుకుంటున్నారు. అటు ఏపీలో కూడా మునుగోడు ఉపఎన్నికల హాట్ టాపిక్ గా మారింది. మునుగోడులో ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నువ్వు నేనా అన్నట్లుగా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపు కోసం పార్టీలన్నీ ఎవరి వ్యూహలతో వారు ముందుకు వెళ్తున్నారు. పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్, బీజేపీకి ఈ ఉపఎన్నిక చావో రేపో అన్నట్లుగా మారింది. సిట్టింగ్ సీటు కాకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోతే మరింత బలహీనపడిపోయే అవకాశముంది. ఇప్పుడే బహిరంగంగా నేతల మధ్య విబేధాలతో హస్తం పార్టీ చితికిలపడిపోయింది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, నేతల మధ్య అంతర్గత పోరు, ఆధిపత్య పోరు, విబేధాల వల్ల కాంగ్రెస్ నష్టపోతుంది. మీడియా వేదికంగా బహిరంగంగా నేతల మధ్య కొట్లాటతో ఆ పార్టీపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది.

ఇక సీనియర్ నేతలు కూడా తనకు సహకరించకపోవడం, తనపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తుండటంతో రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేని పరిస్ధితి. అయితే మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం రేవంత్ అహర్శిశలు శ్రమిస్తున్నారు. మన కాంగ్రెస్-మన మునుగోడు కార్యక్రమంతో ప్రజల్లో తిరుగుతున్నారు. 90 రోజుల పాటు మన మునుగోడు-మన కాంగ్రెస్ పేరుతో ఎ న్నికల ప్రచారం నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. అంతేకాకుండా 8 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై శనివారం ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికలో ఓడిపోతే రేవంత్ పీసీసీ పదవికి కూడా గండం పొంచి ఉండే ప్రమాదముంది. అందుకే గెలుపు కోసం తన వంతు శ్రమిస్తున్నారు.

ఇక బీజేపీ కూడా ఇక్కడ గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టారు. అలాగే టీఆర్ఎస్ కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే మునుగోడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై అనేక సర్వేలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక మీడియా ఛానళ్లలో కూడా ఈ సర్వేలు కలకలం రేపుతోన్నాయి.

అయితే తాజాగా మునుగోడు ఉపఎన్నికపై ఏకంగా సీఎం కేసీఆర్ ఓ సర్వేను బయటపెట్టారు. మునుగోడు ఉపఎన్నికలో గెలుపు టీఆర్ఎస్ దేనంటూ చెప్పుకోచ్చారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉంటుందని తాను చేయించిన సర్వేలో తేలిందంటూ తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆఎస్ కు 471 శాతం ఓట్లు పడతాయని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యలను ఇంచార్జ్ లుగా నియమిస్తానని, ఒక్కో గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలను కేటాయిస్తానంటూ చెప్పారు.

శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నికపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తాను చేయించిన సర్వే రిపోర్టును కేసీఆర్ బయటపెట్టారు. మునుగోడు ఉపఎన్నికపై నేతలకు కీలక సూచనలు చేశారు. బీేపీకి భయడపడేది లేదని, సీబీఐ, ఈడీలతో భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ మనల్ని ఏం చేయలేదని, ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడ చేయాలంటే నడవని వార్నింగ్ ఇచ్చారు.

కానీ కేసీఆర్ బయటపెట్టిన మునుగోడు సర్వేపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఇలా సర్వే రిపోర్టులను బయటపెట్టి టీఆర్ఎస్ దే గెలుపు అంటూ చెప్పుకొచ్చారు. కానీ అక్కడ టీఆర్ఎస్ బోల్తా పడింది. దీంతో ఇప్పుడు కేసీఆర్ మునుగోడు సర్వేలపై పొలిటికల్ సర్కిల్స్ లో, రాజకీయ విశ్లేషకులు అనేక డౌట్లు క్రియేట్ అవుతున్నాయి. ఓటర్లను తమవైపు ఆకట్టుకునేందుకు సర్వే పేరుతో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

గతంలో దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా ఇలాగే టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ సర్వే రిపోర్టులను బయటపెట్టారు. ఇప్పుడు కూడా ప్రజలు తమవైపు ఉన్నారని సర్వేలో తేలిందని చెప్పడంతో ద్వారా ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కేసీఆర్ సర్వే పేరుతో మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ సర్వే నిజమేనా? లేదా మైండ్ గేమ్ నా అనేది తెలియాలంటే మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -