Coconut Water: కొబ్బరి నీళ్లు తాగితే చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అసలు నిజం ఏంటంటే..!

Coconut Water: కొబ్బరి నీళ్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీళ్లను రోజూ తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. మరోవైపు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా విరోచనాలు, వాంతులు, జ్వరం లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఓ కొబ్బరి బోండాం తాగడం వల్ల ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది. జబ్బు నయం కావడానికి దోహదపడుతుంది.

డయాబెటిస్‌ అనేది చాలా ఇబ్బందికర జబ్బు. ఇది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా అని అనుమానాలు వెంటాడుతుంటాయి. అలాంటి అనుమానాల్ని నిపుణులు నివృత్తి చేస్తున్నారు. కొబ్బరినీళ్లు తాగడం మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఓ వరం లాంటిదని చెబుతున్నారు. మధుమేహం కంట్రోల్‌లో ఉంచడంలో కొబ్బరినీళ్లు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.

కొబ్బరినీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించే సామర్థ్యాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. కానీ ఇలా నిపుణులు ఎన్ని చెప్పినా మధుమేహ వ్యాధి గ్రస్తులకు అనుమానాలు వెంటాడుతుంటాయి. కొందరు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి, ఎల్-అర్జినైన్ సమంజసమైన మొత్తంలో ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అనుమానం లేకుండా కొబ్బరి నీళ్లు తాగొచ్చు..
కొబ్బరి నీళ్లలో తక్కువ మొత్తంలో చక్కర శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేయబోదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇందులోని అధిక పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సీ, ఎల్-అర్జినైన్ ఇన్సులిన్‌కు కణాల సున్నితత్వాన్ని పెంచుతాయంటున్నారు. అందువల్ల అనుమానాలు పక్కనపెట్టి కొబ్బరి నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -