Telangana-BJP: తెలంగాణ బీజేపీలో విబేధాలు.. బీజేఎల్పీ నేతలపై భిన్నాభిప్రాయాలు

Telangana-BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎవరనే దానిపై బీజేపీ తేల్చులేకపోతుంది. పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై డైలమాలో ఉంది. సీనియర్ నేత, అనుభవం ఉన్న ఈటల రాజేందర్ కు ఇవ్వాలా.. లేక బీజేపీనే నమ్ముకుని పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఇవ్వాలా అనేది అధిష్టానానికి అర్ధం కావడం లేదు. దీంతో బీజేఎల్పీ పదవిపై బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కొంతమంది ఈటల రాజేందర్ కు ఇవ్వాలని కోరుతుండగా.. పార్టీని ఎప్పటినుంచో ఉన్న రఘునందన్ రావుకు ఇవ్వాలని మరికొంతమంది చెబుతున్నారు.

దీంతో బీజేఎల్పీ పదవిపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ ఇప్పటివరకు బీజేఎల్పీ నేతను బీజేపీ నియమించలేదు. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించడంతో బీజేఎల్పీ పదవి ఖాళీ అయింది. ఆయన స్థానంలో ఈటల రాజేందర్ లేదా రఘునంద్ రావును నియమించాల్సి ఉంది. గతంలో టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఈటల రాజేందర్ పనిచేశారు. దీంతో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఇప్పుడు కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా కూడా ఆయనకే ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాజీయాల్లో సీనియర్ నేతగా ఆయన ఉన్నారు.

అందుకే ఈటలకు పదవి ఇవ్వాలని కొంతమంది కోరుతున్నారు. ఇక రఘనందన్ రావు కూడా మంచి వాగ్దాటి అని, కేసీఆర్ ను ధీటుటా సమాధానం చెప్పగలిగే సబ్జెక్ట్ ఆయనకు ఉందని మరికొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రెస్ మీట్లలో, సభల్లో కేసీఆపై రఘునంద్ రావు విరుచుకుపడుతూ ఉంటారు. ఆయనకు గట్టి వాయిస్ ఉంది. దీంతో రఘునందన్ రావు కరెక్ట్ అని అంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో రఘునందన్ రావు ఉన్నారు. ఇక ఈటల విషయానికొస్తే ప్రభుత్వం బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్నారు. దీంతో బీజేఎల్పీ పదవి ఎవరికి కేటాయిస్తారనేది ఉత్కంఠగా మారింది.

ఈ పదవి విషయంలో నెలకొన్న స్తబ్దత వల్ల బీజేపీలో నేతల మధ్య అభిప్రాయ బేధాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, పదవి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతలందరూ కలిసి ఒకరిని ఫైనల్ చేసి అధినాయకత్వానికి పంపిస్తే అనుమతి ఇస్తారు. కానీ రాష్ట్ర నాయకత్వానికే క్లారిటీ లేకపోవడంతో అధినాయకత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో బీజేపీలో నేతల మధ్య సమన్వయం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరిని ఎల్పీ నేతలను చేసి మరొకరిని ఉపనేతగా చేయాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

అయతే ఎవరికి చేస్తే ఎవరు ఫీల్ అవుతారో అర్ధం కాక బీజేపీ సమమతమవుతుంది. ఎల్పీ నేతనే నియమించకపోతే బీజేపీ తరపున బలంగా వాదించే నేత ఎవర ఉండరు. ముందుగా నడిపించే నేత అసెంబ్లీలో ఉండరు. ఈ చిన్న సమస్యను పరిష్కరించుకోలేక బీజేపీ సమమతమవుతోంది. ఈ సమస్యను బీజేపీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -