Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ ఆరోగ్యం అలా ఉందా.. ఏం జరిగిందంటే?

Comedian Sudhakar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. ఈయన మరణ వార్త ఇండస్ట్రీకి చాలా తీరని లోటని చెప్పాలి. ఇలా రాజ్ మరణ వార్త తెలియగానే సెలబ్రిటీలందరూ ఎంతో విచారం వ్యక్తం చేశారు.

ఇలా రాజ్ మరణ వార్త మర్చిపోకముందే మరో నటుడు ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం కమెడియన్ గా తెలుగు సినిమాలలో నటించిఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి కమెడియన్ సుధాకర్ పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తుంది.

 

ఈయన ఆరోగ్య పరిస్థితి విషమవడంతో ఈయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏంటి అసలు ఏమైందనే విషయాలు మాత్రం అధికారికంగా ఎక్కడ తెలియజేయలేదు. కానీ సుధాకర్ గురించి ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన ఆరోగ్యం గురించి ఇలాంటి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

 

గతంలో ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ఇక ఈయన మరణించారంటూ కొన్ని వెబ్సైట్స్ వార్తలు కూడా ప్రచారం చేశాయి. అయితే ఈ వార్తలపై స్వయంగా సుధాకర్ స్పందిస్తూ తాను బ్రతికే ఉన్నానని సంజాయిస్తూ తన గురించి వచ్చిన తప్పుడు వార్తలను కొట్టి పారేశారు. అయితే తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో కూడా ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -