Rajanala: సిగరెట్ కోసం షాట్ కు రానని చెప్పిన రాజనాల.. ఆ తర్వాత?

Rajanala: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కొన్ని సన్నివేశాలలో భాగంగా సిగరెట్లు కాల్చడం కొందరికి అలవాటు లేకపోయినా సన్నివేశాల కోసం తప్పనిసరి పరిస్థితులలో అలవాటు చేసుకుంటారు. అయితే ఆ అలవాటు వ్యసనంగా కూడా మారిపోతూ ఉంటుంది. అయితే అప్పట్లో సిగరెట్ కంపెనీలో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడం కోసం పొద్దున్నే సినిమా లొకేషన్ లో ఉన్నటువంటి సెలెబ్రెటీలకు వారు ఏ బ్రాండ్ తాగుతారో తెలుసుకొని మరి వారికి అందించేవారు.

ఇలా ఉదయం షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టగానే వారి మేకప్ టేబుల్ పైన సిగరెట్ అగ్గిపెట్టి ఉండడం ఒక ఆచారంగా వచ్చింది అయితే ఒకరోజు సీనియర్ నటుడు రాజనాల రాజలక్ష్మి వారి బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారు. గోల్డ్ ఫ్లెక్స్ కాల్చే అలవాటు ఉంది. రాజనాల ఉదయం లొకేషన్లోకి అడుగుపెట్టేసరికి టేబుల్ మీద సిగరెట్ ప్యాక్ అగ్గిపెట్టె తప్పనిసరిగా ఉండాల్సిందే.

 

ఇక ఒక రోజు షూటింగ్లో భాగంగా తన టేబుల్ పైన అగ్గిపెట్టె సిగరెట్ ప్యాక్ లేకపోవడంతో ఏంటి సీక్రెట్ లేదు అని మేకప్ మెన్ ను అడిగారట. ఇంకాప్రొడక్షన్ వాళ్ళు కొనీ తీసుకు రాలేదు ఈ లోగా మీరు మేకప్ వేసుకోండి తీసుకు వస్తారని మేకప్ మెన్ చెప్పినప్పటికీ రాజనాల మాత్రం సిగరెట్ ప్యాక్ వస్తే కానీ తాను మేకప్ వేసుకోనని భీష్మించుకొని కూర్చున్నారట. మరోవైపు షూటింగ్ మొదలైన రాజనాల రాకపోవడంతో ఎందుకు రాలేదనీ డూండీ అడగడంతో ఆయన ఇంకా మేకప్ వేసుకోలేదు సిగరెట్ ప్యాక్ వస్తే కానీ మేకప్ వేసుకొని అని చెప్పారు.
అంటూ మేకప్ మెన్ చెప్పారు.

 

దీంతో ఒళ్ళు మండిపోయిన డూండీ కోపం నశాలానికి ఎక్కి ఏంటి సిగరెట్ ఇవ్వాలన్నది ఖచ్చితమా ఏదో మర్యాద కోసం ఇస్తున్నాం దీనికోసం ఇంత పట్టింపు అవసరమా 10 నిమిషాల్లో లొకేషన్ లోకి వస్తారా రమ్మనండి లేదంటే నేను నా ఏర్పాట్లలో ఉంటాను అని చెప్పడంతో చేసేదేమీ లేక రాజనాల 10 నిమిషాలలో మేకప్ వేసుకొని షూటింగ్ లోకేషన్ కు వెళ్లారట.ఇలా సెలబ్రిటీలకు సిగరెట్లు ఇవ్వకుండా ఆపేసిన తొలి సమస్త రాజ్యలక్ష్మి వారి సమస్థ అనంతరం ఇదే విషయాన్ని మరికొన్ని సంస్థలు కూడా అనుసరించాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -