Sr.NTR-Jr.NTR: Sr. ఎన్టీఆర్, Jr. ఎన్టీఆర్‌కు మధ్య ఉండే కామన్ పాయింట్స్ గమనించారా?

Sr.NTR-Jr.NTR: దివంగత నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. అప్పటి కాలంలోనే సినీ ఇండస్ట్రీకి కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు పరిచయం చేయడం, యాక్టింగ్‌లో విభిన్న పాత్రలు చేయడం వంటి ప్రయోగాలు చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ పేరును దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఎంతో కృషి చేశారు. సినిమాలతోపాటు రాజకీయంగానూ చెరగని ముద్రను వేశారు. ఆయన మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ సైతం అంచలంచెలుగా ఎదుగుతూ తాతకు తగ్గ మనవడిగా పేరును సంపాదించుకున్నాడు.

అయితే సీనియర్ ఎన్టీఆర్‌కి, జూనియర్ ఎన్టీఆర్‌కి కొన్ని కామన్ పాయింట్లు ఉన్నాయి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఎలాంటి లక్షణాలతో సినీ, రాజకీయ రంగంలోకి ప్రవేశించి స్టార్‌గా ఎదిగారో.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే లక్షణాలతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు. అప్పట్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ పాల ప్యాకెట్లు కూడా వేసే వారు. అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగించుకునేవారు. నాటకాలు, స్టేజీ డ్రామాలు కూడా చేసేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగారు.

తాత బాటలోనే మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా 21 ఏళ్ల వయసులోనే 3 సూపర్‌హిట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సీనియర్ ఎన్టీఆర్‌కు పౌరాణిక పాత్రలంటే ఎంతో ఇష్టం. కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రల్లో నటించారు. అలాగే రాక్షసుల పాత్రల్లో సైతం నటించారు. ఆయన నటించిన ఏ పౌరాణిక పాత్రల్లోనైనా ప్రేక్షకులను ఎంతగానో అలరించేవారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా పౌరాణిక నాటకాల్లో నటించారు. యమదొంగ సినిమాలో యముడిగా, జైలవకుశ సినిమాలో రావణుడి పాత్రలో ప్రేక్షకుల మన్నన పొందాడు. ఎలాంటి పాత్రల్లోనైనా నటించే నైజం వీరిద్దరికే సొంతం. అలాగే వీరిద్దరి లక్కీనంబర్ కూడా 9. అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం, సేవా కార్యక్రమాలు చేయడంలో వీరికి వీరే సాటి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -