Volunteers: వైసీపీ ఎన్నికల ప్రచారంలో గ్రామ, వార్డ్ వాలంటీర్లు.. అధికారుల ఆదేశాలు వీళ్లకు పట్టవా?

Volunteers: వైసీపీ మరోసారి గెలవడం కోసం ఆ పార్టీ అధినేత జగన్ చివరికి కోర్టులు, ఈసీ ఆదేశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి దూసుకుపోదాం అనుకుంటున్నట్టు ఉన్నారు. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో గ్రామవాలంటీర్లు పాల్గొన వద్దని ఈసీ పదేపది చెప్పినా వినడం లేదు. వైసీపీ నేతలను వారిని ఏదో ఒక కార్యక్రమంలో వినియోగించుకుంటున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవద్దని అధికారులు చెప్పినా వారి ఆదేశాలను వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లులో వైసీపీ ఎస్సీ విభాగ నాయకులు ‘ఇంటింటికీ విశ్వన్న’ కార్యక్రమం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ గ్రామ వాలంటీర్లు మంజునాథ్, విజయ్ పాల్గొన్నారు. వైసీపీ నేతలతో కలిసి గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఎన్నికల్లో గెలవడం కోసం ప్రచారంలో ఏదో ఒక్క పేరుతోనైనా వాలంటీర్లను వాడాలని పార్టీ అభ్యర్థులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల దగ్గర ఓటర్ల డేటా ఉంటుంది కనుక వైసీపీ గెలుపు సులువు అవుతుందని జగన్ అభిప్రాయం. అందుకే వాలంటీర్లు ప్రోతాహకాల పేరుతో వారిని మొదట ప్రసన్నం చేసుకున్నారు. వాలంటీర్లే రేపటి వైసీపీ నేతలు అని జగన్ పదేపది చెబుతున్నారు. ఇప్పుడు వారికి ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్నారు. దీన్ని ముందే ఊహించిన టీడీపీ, జనసేన.. ఎలక్షన్ డ్యూటీలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని నియమించొద్దని ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ కూడా ఆమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలు దిక్కరించి వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ.. అటు వైసీపీ నేతలు కానీ.. పలు ప్రాంతాల్లో వాలంటీర్లు కానీ ఈసీ ఆదేశాలను దిక్కరిస్తున్నారు. ఎక్కడిక్కడ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు కనిపిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రలోభాలకు ఓటర్లు లొంగకపోతే.. వారి డేటా తమ దగ్గర ఉందని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -