AP: కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏపీకి ఇంత అన్యాయం చేశాయా?

AP: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొనప్పటికీ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కుండ బద్దలు కొట్టినట్లుగా చెబుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర విభజనపై కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. లోక్ సభలో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఎంతమంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకం అన్నది తేలకుండా భారతదేశ పార్లమెంట్ చరిత్రలో బిల్ పాస్ అయిపోయిందని విమర్శించారు ఉండవల్లి.

రాష్ట్ర విభజన అనేది ఒక షోరూం విభజన లాంటిదని.. షోరూం తెలంగాణకి వెళ్తే ఖాళీ గోదాము ఏపీకు దత్తాయని చెప్పుకొచ్చారు ఉండవల్లి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతున్నప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా..కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నాయి అంటూ ఆంధ్ర ప్రదేశ్ చేతకానితనాన్ని ఎత్తి చూపించారు ఉండవల్లి. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కన్నా దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి గట్టిగా కృషి చేస్తే బాగుండేదని చెప్పుకొచ్చారు.

 

ఈ బిల్లుపై ప్రధాన పార్టీలైన వైసీపీ, జనసేన, టీడీపీ లు తమ వైఖరిని ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే పోలవరం డయాగ్రమ్ వాల్ దెబ్బ తినటానికి ఎవరు కారణము తెలుసుకోగలదు కానీ పట్టించుకోవడం లేదు అంటూ ఆయన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. పవన్ కళ్యాణ్ పై మొదట్లో తనకి కొన్ని అంచనాలు ఉండేవని కానీ బిజెపితో పెట్టుకున్న పొత్తు ఆయన మీద నమ్మకాన్ని చెరిపేసిందని అందుకే ఆయన వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవటం లేదని చెప్పుకొచ్చారు.

 

ఆయన పొత్తులపై అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారంటూ వాపోయారు అరుణ్ కుమార్. ఇంకా మార్గదర్శి కేసు గురించి కూడా మాట్లాడుతూ.. మార్గదర్శి కేసు గురించి తను గతంలో ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆ సంస్థ ఏమి చట్టానికి అతీతం కాదు అనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -