Congress: ప్రచారంలోనూ బీఆర్ఎస్ ను డామినేట్ చేస్తున్న కాంగ్రెస్.. కేసీఆర్ కు ఇది భారీ షాక్ అంటూ?

Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి. బీజేపీ లో నేతలు సైతం అటు బీఆర్ఎస్ లో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ చేరుతున్నారు. అయితే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నుంచి ముఖ్య నేతలను లాక్కోవడానికి కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయాలని రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఎప్పటికి వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, డిసెంబర్లో ప్రమాణం చేసేది కాంగ్రెస్ అని ధీమాతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆ విమర్శలకి ప్రతి విమర్శలు బాగానే చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు కవిత. కేసీఆర్ ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేశారు, ఏడు ఎనిమిది సభలలో కూడా ప్రసంగించారు అయితే పార్టీలో కొత్తగా వచ్చిన ఉత్సాహం ఏమి కనిపించడం లేదు. ఆయన ప్రసంగాలలో కొత్తదనం లేదు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏదో అయిపోతుంది అని ప్రజలను భయపెడుతున్నారు తప్పితే తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తున్నది చెప్పడం లేదు. తమ మేనిఫెస్టోను కూడా ప్రజలలోకి గట్టిగా తీసుకు వెళ్ళలేకపోతున్నారు బీఆర్ఎస్. అయితే ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఉత్సాహంగా ప్రచారాన్ని చేస్తున్నారు. రాహుల్ గాంధీ అతని సోదరీ ప్రియాంక గాంధీతో కలిసి ఉత్తర తెలంగాణలో బస్సు యాత్ర చేస్తున్నారు.

తెలంగాణ ఇచ్చింది తామె అని చెప్పుకోవడంతోపాటు పదేళ్ల పాలనపై ఉండే వ్యతిరేకతను పెంచడం కోసం శాయశక్తుల కృషి చేస్తున్నారు ఈ అక్కా తమ్ముళ్లు. ప్రచారంలో కాంగ్రెస్ వినూత్న పందాను ఎంచుకుంది. అలాగే బహిరంగ సభలకు ప్రజలు సైతం భారీగా తరలిరావడంతో కాంగ్రెస్లో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. ఆ ఉత్సాహంలో వచ్చే ఎన్నికలలో విజయం మాదే అన్న ధీమా కనిపిస్తుంది

Related Articles

ట్రేండింగ్

CM Revanth Reddy Challenges KTR: నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy Challenges KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరిట నిర్వహించినటువంటి...
- Advertisement -
- Advertisement -