Priyanka Gandhi: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ?

Priyanka Gandhi: ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చి ఎన్నో ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు బాగా బలహీనపడిపోయింది. గత ఎన్నికల తర్వాత కొంతమంది నేతలు ఇతర పార్టీల వైపు వెళ్లడం, మోదీ ప్రభావం మరింత పెరిగి బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పంజుకోవడంతో కాంగ్రెస్ చతికిలపడిపోయింది. సోనియాగాంధీ వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, గత ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడంతో పార్టీని అసలు పట్టించుకునేవారే లేకపోయారు.

ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడిపోయింది. కాంగ్రెస్ లోని చాలామంది పాపులర్ నేతలు సైలెంట్ అయిపోయారు. మరికొంతమంది నేతలు ఇతర పార్టీలవైపు వెళ్లారు. దీంతో దేశంలో కాంగ్రెస్ వీక్ అయిపోయి బీజేపీ, ప్రాంతీయ పార్టీలు బలంగా తయారయ్యాయి. అయతే మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు ఉండటంతో మళ్లీ పూనర్వైభవం తెచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. చింతన్ శిబిర్ పేరుతో రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ తిరిగి పంజకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. యువతకు పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేశారు. అయితే ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే ఉండటంతో పర్మినెంట్ గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సి ఉంది. రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు అందుకుంది. కానీ అనారోగ్య సమస్యలు వల్ల ఆమె సరిగ్గా పనిచేయలేని పరిస్థితి. దీంతో కొత్త అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.

ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవివి ఎన్నిక పూర్తి చేయాలని ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్దంగా లేరు. వృధ్యాప్య సమస్యలు, అనారోగ్యం కారణంగా సోనియాగాంధీ కూడా సిద్ధంగా లేరు. దీంతో ప్రియాంకగాంధీ పేరు తెరపైకి వస్తుంది. ప్రియాంకగాంధీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సోనియా, రాహుల్ తర్వాత ప్రియాంక గాంధీనే యాక్టివ్ గా ఉన్నారు. దీంతో ఆమెకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాహుల్ ను ఒప్పించేందుకు కాంగ్రెస్ సీనియర్ల పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని, అప్పుడే పార్టీ బలపడుతుందని కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల సమయానికి సీనియర్ల ఒత్తిడతో రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టకపోపోతే ప్రియాంకగాంధీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -