AP Special Status: కేంద్రంలో కాంగ్రెస్ లేకుండా ప్రత్యేక హోదా ఎలా.. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావమ్మా?

AP Special Status: ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఏపీలో 9 గ్యారెంటీలను ప్రకటించింది. అందులో మొదటి గ్యారెంటీ ప్రత్యేకహోద. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదా ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. షర్మిల మొదటి నుంచి ప్రత్యేకహోదానే ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. మిగిలిన పార్టీలు ఏవీ ప్రత్యేకహోదాపై మాట్లాడకపోవడంతో.. కాంగ్రెస్ కు మాత్రమే అది ఎన్నికల అస్త్రంగా మారింది. దీంతో.. అదే అస్త్రాన్ని కాంగ్రెస్ గ్యారెంటీగా ప్రకటించింది. అయితే.. ప్రత్యేకహోదా ఎంతవరకూ సాధ్యం అనేది ఓసారి గమనించాలి. ఏపీలో అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా సాధ్యం అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే హోదా ఉంటే.. విభజన తర్వాత ఐదేళ్లు టీడీపీ, మరో ఐదేళ్లు వైసీపీ ఉన్నాయి కదా? ప్రత్యేకహోదాను ప్రకటించి ఉండాలి కదా? హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్యారెంటీ.

ఇప్పటికే 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా పేరుతో ప్రజలు మోసపోయారు. 2014, 2019 ఎన్నికలు కూడా ప్రత్యేకహోదా చుట్టూ తిరిగాయి. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని 2014 ఎన్నికల్లో బీజేపీ చెప్పింది. ఎన్నికలు తర్వాత పలు కారణాలు చెప్పి.. మాట మార్చింది. దీంతో, ఈ ప్రత్యేకహోద అంశం వైసీపీకి అస్త్రంగా మారింది. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ప్రత్యేకహోదా తీసుకొని రాలేదని జగన్న ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఫలితంగా 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. కానీ, ఎన్నికల తర్వాత వైసీపీ ప్రత్యేకహోదా మాటే ఎత్తలేదు.

రెండు సార్లు మోసం పోయిన ప్రజలు నెమ్మదిగా ప్రత్యేకహోదా అంశాన్ని మళ్లీ కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో మొదటి గ్యారెంటీగా కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్రంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాధ్యం కావొచ్చేమోకాని.. లేదంటే హోదా సాధ్యం కాదు. కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే.. మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమిని కట్టారు. కానీ..ఈ కూటమి పార్టీలు తలో దారిలో ఉన్నాయి. సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. సింగిల్ గా పోటీ చేస్తామని కూటమిలో కీలక నేత మమత బెనర్జీ చెప్పారు. ఆప్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఒంటరి పోరుకు రెడీ అయింది. నితీష్ కుమార్ ఇండియా కూటమి నేతలకు గుడ్ బై చెప్పి ఎన్డీఏలో చేరారు. ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? ప్రస్తుతం, తెలంగాణ, కర్నాటక తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా లేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే మిత్రపక్షాల సాయంతో రావాలి. అప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా అంటే ఆయా పార్టీలు ఒప్పుకుంటాయా? బీహార్ కు ప్రత్యేకహోదా డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఏపీలో హోదా ఇస్తే.. కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న ఆర్జేడీ ఒప్పుకుంటుందా? దీంతో పాటు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణ కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే.. ఆయా రాష్టాల నుంచి ఏపీకి పరిశ్రమలు తరలిపోతాయని భయం.

తమిళనాడు కూడా ఏపీకి సహకరించే అవకాశం తక్కువే. మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని అడ్డుకోవచ్చు. ఎందుకంటే ఏపీకి హోద వస్తే.. చెన్నై నుంచి కంపెనీలు తరలిపోతాయని భయం. ఇన్ని సమస్యలు ఉండగా.. వైఎస్ షర్మిల.. చాలా ఈజీగా ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొని వస్తామని ప్రకటిస్తున్నారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేయడమే అవుతుంది. ఈ పార్టీలు అన్ని ఒప్పుకోవాలి అనుకున్నా.. అసలు కూటమి అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ బలపడాలి. గట్టిగా కొడితే.. తెలంగాణ, కర్నాటక తప్ప మిగిలిన రాష్ట్రాల్లో మిత్రపక్షాల బలమే కూటమి బలంగా చెప్పుకోవాలి. కూటమి అయినా బీజేపీని ఎదుర్కొపరిస్థితి ఉందా? అంటే.. మోడీ టార్గెట్ 400 అంటున్నారు. అంత దూకుడుగా వెళ్తున్న బీజేపీకి ఎదుర్కొని కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎప్పుుడు? ప్రత్యేకహోదా ఇచ్చేది ఎప్పుడు?

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -