Congress Party: పేద కుటుంబంలోని ప్రతి మహిళకు లక్ష రూపాయలు.. కాంగ్రెస్ సంచలన హామీలు వైరల్!

Congress Party: త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో కేంద్రంలో కూడా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం పెద్ద ఎత్తున ఎన్నికల హామీలను ప్రకటిస్తూ ఓట్లు పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యేకంగా మహిళల కోసమే కొన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తామంటూ హామీ ఇచ్చారు.

మరి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం తొలగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఏ విధమైనటువంటి లబ్ధి కలుగుతుంది అనే విషయానికి వస్తే ప్రతి ఏడాది పేదరికంలో ఉన్నటువంటి మహిళలకు స్వయంగా వారి ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.

ఇక కేంద్ర ప్రభుత్వ విభాగాలలో కొత్తగా చేపట్టే నియామకాలలో 50% మహిళలకు కేటాయించబడుతుందని తెలియజేశారు. ఇక ఆశ అంగన్వాడి కార్యకర్తల నెలవారి జీతంలో కేంద్ర వాటాని పెంపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఇక న్యాయపరమైనటువంటి హక్కులలో మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రతి పంచాయతీలోనూ అధికార మైత్రి ఉంటారు.

ఇక ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ హామీలన్నింటిని నెరవేరుస్తామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఇక భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ హామీలను పోస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -