Sharmila: రాహుల్ ను ప్రధాని చేసేవరకు పోరాటం ఆగదు.. షర్మిల కామెంట్స్ వైరల్!

Sharmila: విజయవాడలో పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తండ్రి ఆశీర్వాదం కోసం ఇడుపులపాయ వచ్చి వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే వైయస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఆయన బాటలో నడుస్తూనే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేస్తాను ఇదే నా లక్ష్యం అని పేర్కొన్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తండ్రి ఆశీర్వచనం కోసమే ఇడుపులపాయ వచ్చాను.

 

ఆయనకి కాంగ్రెస్ పార్టీ అన్నా ఆ పార్టీ సిద్ధాంతాలు అన్నా ప్రాణంతో సమానం. వాటికోసం ఎంత దూరమైనా వెళ్లేవారు మనదేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేదు కాంగ్రెస్ సిద్ధాంతాలు నిలబడాలి, దేశానికి మంచి జరగాలని కాంగ్రెస్ లో చేరాను అని చెప్పుకొచ్చారు షర్మిల. సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ దిక్సూచి లాగా పనిచేశారు.

పేదల కోసం ఆయన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆయన ఆశయాల కోసం రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకే షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చారు అని వివరించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన తరువాత తొలిసారి కడప జిల్లాకు విచ్చేసిన షర్మిలకు కాంగ్రెస్ నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈమె శనివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు వచ్చారు.

 

అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకి చేరుకున్నారు వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కెవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ రెడ్డి, తులసి రెడ్డి తదితరులతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆమె సమక్షంలో కడపకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -