YS Jagan: జగన్ పై ప్రముఖ రాజకీయ నేత విమర్శలు.. అక్కడే తప్పు జరిగిందంటూ?

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అమరావతి రాజధానిని ప్రకటిస్తున్న సమయంలో ఈయన కూడా మద్దతు తెలిపిన విషయం మనకు తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట తప్పి మడమ తిప్పి అమరావతి రాజధాని కాదని మూడు రాజధానులు ముద్దు అంటూ ఏకంగా రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేశారు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి హై కోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానులపైనే మొండి పట్టు పడుతుంది.

 

ఇక ఉగాది తర్వాత ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన కొనసాగించవచ్చు అంటూ మంత్రులు పదేపదే ఈ విషయం చెబుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంపై జగన్ తన మంకు పట్టు విడవాలని వెల్లడించారు. అమ‌రావ‌తి ఉద్య‌మం 1200 రోజుల‌కు చేరింద‌న్నారు. చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని ఉద్య‌మంగా ఆయ‌న అభివ‌ర్ణించడం గ‌మ‌నార్హం.

 

తాడేపల్లిలో నివాసం కట్టుకున్న ఏకైక నాయకుడు జగన్ రాజధాని విషయంలో ప్రజల్ని మభ్యపెట్టారు అంటూ ఆరోపణలు చేశారు.ఇలా ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట చెప్పడంతో ప్రజలకు జగన్ పై నమ్మకం పోయిందని ఇప్పటికైనా ఈయన సరైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటిస్తే ఈయన పార్టీకి కొంతమేర లాభం ఉంటుందని లేకపోతే వైసిపి పార్టీ కథ ఇక్కడితోనే ముగుస్తుంది అంటూ హెచ్చరించారు.

 

ఈ విధంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మూడు రాజధానుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలువురు ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ
చేయ‌ని ఉద్య‌మం 1200 రోజులు ఎలా పూర్తి చేసుకున్న‌దో రామ‌కృష్ణ‌కే తెలియాలి.అర‌స‌వెల్లి వ‌ర‌కూ చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను కూడా పూర్తి చేయ‌ని దుస్థితి ఏర్పడింది ఇక రాజధాని గురించి టిడిపి ప్రభుత్వమే పట్టించుకోలేదని అలాంటి పక్షంలో సిపిఐ ఎవరికోసం రాజధాని గురించి పోరాడుతుందో తెలియాల్సి ఉంది అంటూ పలువురు రామకృష్ణ వ్యాఖ్యలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -