Daggubati Purandeswari: తండ్రి పార్టీలోకి పురందేశ్వరి..? బీజేపీ అందుకే లైట్ తీసుకుందా?

Daggubati Purandeswari: బీజేపీ నాయకురాలు పురందేశ్వరిని ఆ పార్టీ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు బీజేపీ కార్యక్రమాల్లో ఆమె చురగ్గా పాల్గొనేది. ఏపీ బీజేపీ తరపున వాయిస్ బలంగా వినిపించేది. కానీ ఇటీవల పురందేశ్వరి బీజేపీ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనడం లేదు. బీజేపీ కార్యక్రమాల్లో ఆమె ఎక్కువగా కనిపించడం లేదు. దీనిని కారణం ఆమెను బీజేపీ లైట్ తీసుకోవడమేనన చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జరుగుతోంది. బీజేపీలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించారు. కీలక పదవుల నుంచి పురందేశ్వరిని తొలగించారు. దీందో బీజేపీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంతో ఇటీవల పురందేశ్వరి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే మాజీ కేంద్రమంత్రిగా ఉన్న పురందేశ్వరి గత ఎనిమిదేళ్లుగా బీజేపీలోనే ఉన్నారు. గతంలో రెండుసార్లు విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచిన ఆమె.. కాంగ్రెస్ హయాంలో కేందమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు. అప్పటినుంచి బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఇటీవల బీజేపీలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

బీజేపీలో చేరికల కమిటీ ఛైర్మన్ గా ఆమెకు బాధ్యతలు ఇచ్చారు. కానీ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించడంలో ఆమె ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకరిని కూడా ఆమె పార్టీలోకి తీసుకురాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి నేతలను తీసుకొస్తారేమోనని బీజేపీ వర్గాలు భావించాయి. అసలు వలసల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఆమె ఒకక సమావేశం కూడా నిర్వహించలేదు. తెలంగాణ బీజేపీలోకి భారీ నేతలు వస్తుంటే.. ఏపీలో ఇతర పార్టీ నేతలు ఒక్కరూ కూడా బీజేపీలో చేరడం లేదు.

ఎన్టీఆర్ కూతురు కావడంతో పార్టీకి ప్లస్ అవుతుందని బీజేపీ నేతలు ఆశించారు. కానీ ఆమె వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని, అందుకే బీజేపీ వర్గాలు లైట్ తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో టీడీపీతో టచ్ లోకి పురందేశ్వరి వెళ్లినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

రెండుసార్లు ఆమె బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. 2019లో విశాఖ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదు. రాజ్యసభపదవి లేదా స్టేట్ ప్రెసిడెంట్ పదవి దక్కుతుందని పురందేశ్వరి ఆశించారు. కానీ ఆమెకు ఎలాంటి పదవి దక్కలేదు. అలాగే ఒడిషా ఇంచార్జ్ పదవి నుంచితో పాటు ఛత్తీస్ గఢ్ ఇంచార్జ్ పదవి నుంచి కూడా ఆమెను ఇటీవల తప్పించారు. దీంతో బీజేపీలో పురందేశ్వరి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

దీంతో ఆమె టీడీపీతో టచ్ లోకి వెళుతున్నట్లు బీజేపీ పెద్దల్లో అనుమానం నెలకొందట. ఆమె కుమారుడు చెంచురాం హితైష్ ను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీలోకి దింపాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. కుమాడురు హితేష్ కు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో దగ్గుబాటు వెంకటేశ్వరరావు పోటీలోకి దిగారు. అయితే కుమారుడికి టీడీపీ నుంచి టికెట్ కోసం పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆమెకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో పాటు పదవుల నుంచి తొలగించినట్లు టాక్ వినిపిస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఆమె బీజేపీలో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -