Pawan Kalyan: పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి 600 కోట్ల రూపాయలా.. ఈ లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే!

Pawan Kalyan: ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒక వైపు అయితే పిఠాపురం రాజకీయం మరోవైపు ఉందని చెప్పాలి. కేవలం ఆంధ్రాలో మాత్రమే కాకుండా తెలంగాణ వారు సైతం పిఠాపురం నియోజకవర్గం పై పెద్ద ఎత్తున ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం గమనార్హం. పవన్ కళ్యాణ్ గతంలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు.

వైసిపి కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. ఇప్పటికే మండలానికి కొంతమంది కీలక నాయకులను రంగంలోకి దింపి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. ఆయన గెలిచిన పిఠాపురం వాసులకు పెద్దగా ప్రయోజనం ఉండదని వైసీపీ ప్రచారం చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రచార కార్యక్రమాలలో భాగంగా వైసిపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

వైసిపి కొంతమంది కిరాయి మూకలు సన్నని బ్లేడ్లతో తమపై దాడి చేస్తున్నారని ఈయన వెల్లడించారు. అంతేకాకుండా మండలానికి పెద్ద ఎత్తున నాయకులని దించి తన ఓటమికి ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ తెలిపారు. అంతేకాకుండా కాకినాడ పోర్టు వద్ద కంటైనర్ల నిండా డబ్బులు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు.ఇవన్నీ రాజకీయ విమర్శలుగా ఉండొచ్చు. కానీ కాపు బలిజ తెలగ జేఏసీ లీడర్ దాసరి రాము అయితే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. పవన్ ని అసెంబ్లీకి వెళ్లనీయకుండా అతి పెద్ద కుట్ర సాగుతోందని ఆయన అంటున్నారు.

పవన్ ని ఓడించేందుకు ఆరు వందల కోట్ల రూపాయలను ఒక్క పిఠాపురానికే తరలించారని తెలియజేశారు. ఇలా ఒక్క నియోజకవర్గానికి 600 కోట్లు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఒక్కో కుటుంబానికి 50వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బు పంపిణీ చేస్తున్నారని ఇదంతా పవన్ కళ్యాణ్ ఓటమి కావడానికి వైసిపి కుట్ర చేస్తుందని వెల్లడించారు.

ఇక ఈ వ్యాఖ్యలపై వంగా గీత కూడా స్పందిస్తూ ఓటర్లను ఇలా డబ్బుతో ముడి పెట్టడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై బ్లేళ్లతో దాడులు జరిగితే ఈసీకి ఫిర్యాదు చేయాలి కదా అలాగే కంటైనర్ల నిండా డబ్బు ఉంటే ఈసీకి ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది కదా అంటూ వైసీపీ నేతలు కూడా ఈ విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -