Deepak Hooda: తొలి టీ20లో అంపైర్‌పై రెచ్చిపోయిన దీపక్‌ హూడా.. ఎందుకంటే!

Deepak Hooda: మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ కోసం ఇండియాలో పర్యటిస్తోంది శ్రీలంక జట్టు. ఈ క్రమంలో తొలి టీ20 ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియాకు పరాజయం తృటిలో తప్పింది. 2 పరుగుల తేడాతో నెగ్గింది హార్దిక్‌ పాండ్య సేన. అయితే, టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ దీపక్‌ హూడాపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు.. అదేంటి.. బాగా బ్యాటింగ్‌ చేసినా మండిడటమేంటి అనుకుంటున్నారా? ఇందులో ఓ మతలబు ఉంది.

 

బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో దీపక్‌ హూడా బాధ్యతాయుత ఇన్నింగ్‌ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు చేసిన దీపక్‌ హూడా టీమిండియా గెలుపులో కీలక పాత్ర అని చెప్పడంలో సందేహం లేదు. అయితే, బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు దీపక్‌ హూడా చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా కాస్త దూకుడు ప్రదర్శించాడు. అయితే, ఈ క్రమంలోనే అంపైర్‌పై గొడవకు దిగాడు దీపక్‌ హూడా. అందుకు కారణం కూడాలేకపోలేదు.

 

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మ్యాచ్‌లో భారత్‌ తరఫున శుభమన్‌ గిల్‌, శివమ్‌ మావి అరంగేట్రం చేశారు. వీరిద్దరూ టీ20ల్లో ఇప్పటికే ఆడినప్పటికీ దేశం తరఫున బరిలోకి దిగడం తొలిసారి. ఐపీఎల్‌లో ఇద్దరికీ మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. శివమ్‌ మావి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో మంచి పేసర్‌గా రాణించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ లాంటి జట్లలో కీలక ప్లేయర్లను ఔట్‌ చేయడంలో శివమ్‌ మావిది బెస్ట్‌ బౌలింగ్‌ అటాక్‌గా చెబుతారు.

 

అంపైర్‌ను గౌరవించడం నేర్చుకో..
మరోవైపు శుభమన్‌ గిల్‌ సైతం కేకేఆర్‌ తరఫున ఓపెనర్‌గా ఆడాడు. బ్యాటింగ్‌లో అచ్చం విరాట్‌ కోహ్లీని పోలిన శైలితో రాణిస్తున్నాడు. అటు టెస్టులు, వన్డేల్లోనూ శుభమన్‌ గిల్‌ బ్యాటింగ్ అద్భుతంగా చేస్తుండడంతో టీ20ల్లో ప్రవేశం సులభమైంది. ఇక శ్రీలంకతో తొలి టీ20లో బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో టీమిండియా త్వరగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో దీపక్‌ హూడా ఇన్నింగ్స్‌తో బూస్ట్‌ ఇచ్చినట్లయింది. 18వ ఓవర్లో ఓ బంతి వైడ్‌గా వెళ్లినప్పటికీ అంపైర్‌ ఇవ్వకపోవడంతో దీపక్‌ హూడాకు కోపం వచ్చింది. అంపైర్‌ వద్దకు వెళ్లి వాగ్వాదం చేశాడు. బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. దీంతో నెటిజన్లు హూడాపై మండిపడుతున్నారు. అంపైర్‌ను గౌరవించడం నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -