SSMB29: మహేష్ బాబుకు జోడిగా బాలీవుడ్ నటి.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు?

SSMB29: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకతీరుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి సినిమా క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే. ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటేనే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి.బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించిన జక్కన్న అనంతరం ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది.ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి కెరియర్ లోనే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుందని ఇదివరకే రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

రాజమౌళి తన సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడంతో వివిధ భాషలలో నటీనటులను సినిమాలలో తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్రలో మౌని రాయి నటించబోతున్నట్టు ఇదివరకు వార్తలు వచ్చాయి. అదేవిధంగా ప్రస్తుతం మహేష్ బాబు సరసన నటించడం కోసం బాలీవుడ్ హీరోయిన్ ను జక్కన్న సంప్రదించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దీపికా పదుకొనే ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్వరలోనే ఆమెను కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ తెలియచేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక రాజమౌళి వంటి అగ్రదర్శకుడు స్వయంగా వెళ్లి అడిగితే ఏ హీరోయిన్ కూడా అవకాశం వదులుకోదు. ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన ప్రాజెక్టుకే సినిమాలో నటిస్తున్నారు.మరి రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -