Devotional: శనైశ్చరుని పూజించేటప్పుడు నియమాలు తెలుసా? ఇవి తెలుసుకోండి..!

Devotional: వాస్తు శాస్త్రంలో అనేక నియమాలను పండితులు సూచించారు. వాటిని పాటించడం ద్వారా నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను సులువైన పరిష్కారం పొందవచ్చు. ఈ క్రమంలో పూజా మందిరం విషయంలోనూ వాస్తు శాస్త్రం పరంగా అనేక అంశాలను పాటించవచ్చు. ముఖ్యంగా శనైశ్చరుడి పేరు చెబితేనే చాలా మంది భయపడిపోతుంటారు.

ప్రతి మనిషి జీవితంలోనూ 30 ఏళ్లకోసారి ఏడున్నర సంవత్సరాల పాటు జాతక చక్రం ప్రకారం ఏలిన నాటి శని ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ సమయంలో కొందరి జీవితాలు పూర్తిగా తలకిందులవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో అనేక మంది భయపడిపోతూ ఉంటారు. అయితే, నిజానికి శనైశ్చరుడు సాక్షాత్తూ సూర్య భగవానుడి తనయుడు కాబట్టి.. మానవాళికి అజ్ఞానాంధకారాలు తొలగించి మంచి ప్రవర్తన కలిగి ఉండేలా చేసేందుకు ఏడున్నర సంవత్సరాల కాలం పాటు అనేక పరీక్షలు పెడుతుంటాడని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.

అయితే, ఇలాంటి సమయాల్లో శనిదేవుడిని నిష్టతో పూజించడం వల్ల అలాంటి వారిపై శని ప్రభావం తగ్గి జీవితం కాస్త సాఫీగా జరిగిపోయే వీలుంటుంది. ఈ నేపథ్యంలో శని దేవుడిని పూజించే వాళ్లు ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు తెలుసుకోవాలి. పాటించకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో గమనించాలి. శని దేవుని పూజ చేసే సమయంలో ఒంటిపై ధరించే దుస్తుల రంగుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

ఈ నియమాలు పాటించాలి..
శనిదేవుని పూజ సమయంలో ఎరుపు రంగు దుస్తులు వేసుకోరాదు. ఆయనకు ఇష్టమైన నీలం, నలుపు రంగు దుస్తులు ధరించాలి. శని దేవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్ను చూపకూడదు. శని దేవుడిని పూజించేటప్పుడు ఎదురుగా నిల్చొని ఉండరాదు. శని దేవుని పూజ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్లినా నిలబడి ఉన్న స్థానం నుంచి అలాగే వెనక్కు వెళ్లిపోవాలి. పూజ సమయంలో శని దేవుడి కళ్లలోకి చూడకూడదు. శనిని పూజించే సమయంలో కళ్లు మూసుకుని ఉండాలి. లేదంటే ఆయన పాదాల వైపు చూస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -