MS Dhoni: కడక్ నాథ్ కోళ్ల పెంపకానికి మహేంద్ర సింగ్‌ ఆసక్తి.. కారణం అదే!

MS Dhoni: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోని.. బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నాడు. తనకిష్టమైన వ్యవసాయంతోపాటు.. ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమ నడిపిస్తున్నారు. రాంచీలో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించారు. తన నలబై ఎకరాల ఫామ్ హౌస్ లో రెండు వేలకు పైగా కడఖ్ నాథ్ కోళ్లను పెంచేందుకు ఏర్పాట్లు చేశాడని వార్తలు వస్తున్నాయి. తీరిక దొరికినప్పుడల్లా ఫామ్ హౌస్ లోనే కుటుంబంతో గడిపే ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐపీఎల్ లో చెన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేలోపు తనకిష్టమైన వ్యాపకాలతోనే బిజీగా ఉండేందుకు ఇప్పటికే ఫామ్ హౌస్ లో చేపలు.. బాతులు పెంచుతున్నాడు. వీటితోపాటు మంచి పోషక విలువలుండే ఖరీదైన కడక్ నాథ్ కోళ్లను పెంచడంపై దృష్టి సారించారు. జాబువాలోని కడక్ నాథ్ ముర్గా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఐఎస్ తోమర్ను ధోనీ సంప్రదించగా ఆయన చేతులెత్తేశాడు. ఒక్కసారి రెండు వేల కడక్ నాథ్ కోడి పిల్లలు.. లేదా కోళ్లు దొరకడం ఇప్పుడు కష్టంగా ఉందని చెప్పాడు.

అయితే తనకు తెలిసిన ఓ రైతు ఫోన్ నెంబర్ ఇవ్వడంతో తండ్లాలోని రైతును ధోనీ సంప్రదించాడు. కడక్ నాథ్ కోళ్లకు మంచి గిరాకీ ఉండడంతో ఫుల్ డిమాండ్ ఉంది. అడిగింది మన క్రికెటర్ కావడంతో నెలాఖరులోగా ధోనీకి 2 వేల కడక్ నాథ్ కోడి పిల్లలను అందించారు. నల్లగా ఉండే కడక్ నాథ్ కోడిలో ఔషధ గుణాలెక్కువ. ఎక్కువ ప్రొటీన్ తోపాటు తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందట. అందుకే ధర చాలా ఎక్కువ. కిలో 700 – 1500 వరకు పలుకుతుంది. కరోనా ప్రభావంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్న అవగాహన ప్రజల్లో పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడక్ నాథ్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంటుందని ధోనీ ఆర్గానిక్ పౌల్ట్రీని ప్లాన్ చేసినట్లు వర్తాలు సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -