Diabetes: మీలో ఈ మార్పులు వస్తే డయాబెటీస్‌ మీ దరికి రాదు!

Diabetes: ప్రస్తుత రోజుల్లో వివిధ రకాల వ్యాధులు ప్రభలుతున్నాయి. రోజుకొ రకం వ్యాధులు వ్యాపిస్తుండటంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.క్యాన్సన్, హైబీపీ, గుండె జబ్బులతో పాటు డయాబెటీస్‌ కూడా చాలా మందిని ఇక్కట్లకు గరి చేస్తోంది. శరీరంలో షుగర్‌ లెవల్‌ను కంట్రోల్‌ చేయకపోతే నరాల సమస్యలు, గుండె జబ్బులు, కంటి చూపు కోల్పోవడం, దంతాలు పాడవడం అజీర్తి, కిడ్నీ సమస్యలు, మతిమరుపు వచ్చే ప్రమాదాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్‌ వస్తే తీసుకునే ఆహారంతో పాటు ఇతరాత్ర విషయల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు టెస్ట్‌తో పాటు మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే డయాబెటీస్‌ మీ ఆధీనంలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

మన దేశంలో దాదాపుగా 7.7 కోట్ల మంది డయాబెటీస్‌తో సతమతమవుతున్నారు. ప్రతి 11 మందిలో ఒకరు డయాబెటీస్‌ బారిన పడుతున్నటుల ఓ పరిశోధనలో వెల్లడైంది. డయాబెటీస్‌ సోకిన వారిలో చైన మొదటి స్థానంలో ఉండగా మన దేశంలో రెండవ స్థానంలో ఉంది. మన దేశంలోనూ వయస్సు బేధం లేకుండా ఈ వ్యాధి వెంటాడుతోంది. డయాబెటీస్‌ సోకిన వారు మాసం, చేపలు తదితర మాంసపు కృత్తులను తగ్గువగా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాసం కూడా తినవచ్చు కానీ.. ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యులను సంప్రదించే తీసుకోవాలని పేర్కొంటున్నారు.

 

ఆకుకూరలు,తృణధాన్యాలు, పండ్లు, మొలకలను ఎక్కువగా తినాలి. ఇలాంటి పదార్థాల్లో జీవం శరీరం, కణాలకు ఉత్తేజాన్ని ఇస్తోంది. వీటిని కూడా వైద్యుల సలహాలతోనే తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి కొలెస్ట్రా, చెడు కొవ్వును పెంచే ఆహారాన్ని తగ్గించాలి. నూనెల్లో ఫ్రై చేసే వంటకాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. అలాంటి పదార్థాలు తీనాలనిపిస్తే వాటి స్థానంలో ఫ్రూట్‌ సలాడ్, సూప్‌లును షుగర్‌ కలపకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచింది. రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువగా వ్యాయామం చేస్తే మంచిది. శరీరం నుంచి ఎంత ఎక్కువగా చెమట బయటకు వెళ్తే శరీనంలోని చెడు కొవ్వు అంతగా కరిగిపోతుందన నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -