Anasuya: జబర్దస్ట్ వదిలేసి అనసూయ తప్పు చేసిందా?

Anasuya: జబర్దస్త్ దాదాపు గత దశాబ్దంన్నర కాలం నుంచి విజయవంతంగా సాగుతున్న షో. నార్త్ లో బాగా పాపులర్ అయిన స్టాండ్ అప్ కామెడీ ని తెలుగు వారికి పరిచయం చేసింది ఈ షో. అయితే ఇందులో యాంకర్ అనసూయ పాత్ర కూడా ఎంతో ఉంది. అనసూయ ని చూడటానికే చాలా మంది షో చూసేవాళ్ళు ఉన్నారు అంటే అతి శయోక్తి లేదు. అంతలా అనసూయ షో లో భాగం అయిపోయింది.

 

అలాంటి అనుబంధానికి ముగింపు పలుకుతూ అనసూయ జబర్దస్త్ నుంచి వైదొలిగింది. సినిమాల కోసం అనసూయ జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోయింది అని వార్తలు వచ్చాయి ఆ మధ్య. ఈటీవీ నుంచి స్టార్ మా కి వెళ్ళింది ఈ పొడుగు భామ. కామెడీ స్టార్స్ షోకి సహ వ్యాఖ్యాతగా ఉంది అనసూయ. కొన్ని ఎపిసోడ్స్ కూడా చేసింది. అయితే ప్రస్తుతం అనసూయ చేతిలో మాత్రం బుల్లితెర ప్రోగ్రామ్స్ ఏమీ లేవు అంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇంతకు ముందులా అనసూయ షోస్ లో కనిపించి చాలా సమయమే అయ్యింది.

 

ప్రస్తుతం అనసూయ ఏం చేస్తున్నట్టు?

 

వేరే షోస్ ఒప్పుకున్నట్టు కూడా ఎక్కడా రాలేదు కాబట్టి బుల్లితెర మీద అనసూయ బిజీగా లేదా అనే అనుమానం ఉంది చాలా మందిలో. ఇక సినిమాల విషయానికి వస్తే అక్కడ కూడా అనసూయ చేతిలో ప్రాజెక్ట్స్ లేవు అని అంటున్నారు. అల్లు అర్జున్ పాన్-ఇండియా చిత్రం పుష్ప లో మంచి పాత్ర లభించింది అనసూయకి. సీక్వెల్ లో కూడా ఈ పాత్రని కొనసాగించే అవకాశం లేకపోలేదు. దీని బట్టి అనసూయ చితిలో పుష్ప-2 మాత్రమే ఉంది అంటున్నారు.

 

అయితే ఇతర ప్రాజెక్ట్స్ అనుకున్న సమయానికి మొదలయ్యే అవకాశం లేదు అంటున్నారు. అందుకని బుల్లితెర మీద కూడా కొంచం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనే వాదన కూడా ఉంది. కొత్త సినిమా వచ్చి అది విడుదలయ్యే నాటికి బాగా టైం ఉంటుంది కాబట్టి బుల్లితెర మీద కనిపిస్తే ఆమెకే మంచిది అంటున్నారు. కొంత మంది అనసూయ జబర్దస్త్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు అని కూడా అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -