Balakrishna: జగన్ ఇచ్చిన ట్విస్ట్ తో బాలకృష్ణ చాలా ఫీలయ్యారా?

Balakrishna: వెండి తెర మీద డైలాగులు చెబుతుంటూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయే చేయగలిగే హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్యే. నందమూరి తారకరామారావు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలయ్య.. తనదైన నటన, స్టైల్, డ్యాన్స్ తో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రికార్డులతో జెట్ వేగంతో దూసుకెళుతున్నాడు.

నందమూరి బాలయ్యను అభిమానించే చాలా మంది అభిమానుల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ కూడా ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, పేపర్ లో ఫోటోలు వేయించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమాపరంగా బాలయ్య అంటే జగన్ కు ఎంతో అభిమానం ఉండగా.. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. అయితే తాజాగా జగన్ చేసిన పని బాలయ్యను హర్ట్ చేసిందట.

తన అభిమాన హీరో అయిన నందమూరి బాలయ్య విషయంలో వైయస్ జగన్ ప్రవర్తించిన తీరు మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. నందమూరి బాలయ్య ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఇప్పటికే పూర్తి కాగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని సినిమా యూనిట్ భావించిందట.

‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏపీలోని ఒంగోలులో నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందట. దీనికి బాలయ్య కూడా ఓకే చెప్పాడట. కానీ జగన్ వల్ల ఒంగోల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి వీలు లేకుండా పోయిందట. దీంతో బాలయ్య అభిమాని అయిన జగన్.. ఇలా ఒంగోలులో తన అభిమాన హీరో బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా అడ్డుకోవడం ఏంటనే చర్చ సాగుతోంది. అభిమానం ఉంటే ఇలానే చేస్తారా? అని బాలయ్య కూడా జగన్ మీద ఫైర్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -