Balayya: ఆస్తుల విషయంలో బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారా?

Balayya: సినీ పరిశ్రమలో ఎందరో స్టార్లు ఉంటారు. సక్సెస్ ఉన్నన్ని రోజులే వారి వెంట అందరూ పడుతుంటారు. ఒక హీరోతో సినిమా తీస్తే కోట్ల రూపాయలను వెనకేసుకోవచ్చు అంటే వెంటపడక మరేం చేస్తారు? అయితే అదే హీరో ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకునే నాథుడు కూడా ఉండడు. కానీ కొందరు మాత్రం వైఫల్యాల నుంచి గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా తిరిగొచ్చి తామేంటో నిరూపించుకుంటారు.

 

నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ కోవలోకే వస్తారు. ‘లక్ష్మీనరసింహ’ సినిమా తర్వాత వరుసగా పరాజయాలు ఎదురైనా ఆయన ఎదురొడ్డి తట్టుకున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ సక్సెస్ తో విమర్శకుల నోళ్లు మూయించారాయన. అనంతర మళ్లీ పరాజయాలే పలకరించినా ఆయన ధైర్యం కోల్పోలేదు. కరోనా టైమ్ లో థియేటర్లకు వచ్చేందుకు ఆడియెన్స్ అందరూ భయపడుతున్న వేళ.. ‘అఖండ’తో బిగ్ స్క్రీన్స్ లో జాతర సృష్టించారు బాలయ్య.

 

వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న బాలయ్య
‘అఖండ’లో బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూసేందుకు ఆడియెన్స్ క్యూ కట్టారు. ఈ మూవీ తర్వాత ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో తానేంటో మరోసారి నిరూపించారు బాలయ్య. చిన్న పిల్లాడిలా సందడి చేస్తూ, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతూ సెలబ్రిటీలను ఆయన ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ షో రెండో సీజన్ నడుస్తోంది.

 

ఇకపోతే, బాలకృష్ణకు ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా సంక్రమించినవి, తాను సంపాదించినవి ఇలా ఆయన మంచి ఆస్తుపరుడని ఇండస్ట్రీ టాక్. ఆయనకు ముగ్గురు పిల్లలు. అందులో ఒకరు మోక్షజ్ఞ కాగా.. నారా బ్రాహ్మణి, తేజస్వినిలు ఇద్దరు ఆడపిల్లలు. ఆస్తుల పంపకం విషయంలో బాలయ్య నిర్ణయం తీసుకున్నారట. కొడుకుతోపాటు కూతుళ్లకు కూడా సమానంగా వాటా పంచాలని ఆయన ఫిక్స్ అయ్యారని సమాచారం. దీంట్లో ఎంత నిజం ఉందనేది బాలయ్యకే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -