Manchu Manoj: భూమా మౌనికకు మనోజ్ అలాంటి బహుమతిని ఇచ్చారా?

Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోగా అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు మంచు మనోజ్. కానీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. ఇక కొంతవరకు తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక వ్యక్తిగతంగా కూడా మనోజ్ కు మంచి గౌరవం ఉంది. ఇక గతంలో ఈయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నాడు.

 

అలా కొంతకాలం ఒంటరిగా ఉన్న మనోజ్ జీవితంలోకి మరో అమ్మాయి భూమా మౌనిక రెడ్డి వచ్చింది. ఇటీవలే వీరిద్దరూ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. భూమా మౌనిక రెడ్డికి కూడా అంతకుముందే మరో వ్యక్తితో పెళ్లి జరగగా ఒక బాబు కూడా జన్మించాడు. కానీ కొన్ని కారణాలవల్ల భూమా మౌనిక రెడ్డి తన మొదటి భర్తను వదిలేసింది. అలా ఆమె కూడా ఇంతకాలం ఒంటరిగా జీవించగా మనోజ్ తో పరిచయం ఏర్పడటంతో అది ప్రేమగా మారింది.

అలా వీరిద్దరు పెళ్లికి ముందే పలు మార్లు కలవడం.. మీడియా కంట పడటం.. అంతేకాకుండా ఓ పుణ్యక్షేత్రంలో ప్రత్యక్ష పూజలు చేయించుకోవడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు. అలా ఈ అనుమానాలను ఇటీవలే నిజం చేశారు. ఇక మనోజ్ కూడా మౌనిక రెడ్డి కొడుకును సొంత కొడుకుగా చూసుకోవడం అనేది అందర్నీ ఫిదా చేసింది అని చెప్పవచ్చు.

 

అయితే ఇదంతా పక్కన పెడితే.. వీళ్ళ పెళ్లి జరిగిన నేపథ్యంలో వీరి గురించి రోజుకొక వార్త బయట పడుతుంది. అయితే తాజాగా మనోజ్ తన భార్య మౌనిక రెడ్డికి ఇచ్చిన బహుమతి గురించి కూడా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. మనోజ్ తన భార్యకు రూ.10 కోట్ల విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇక ఇది ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -