Manchu Manoj-Bhuma Mounika: మంచు మనోజ్ భార్యను ప్రేమగా అలా పిలుస్తారా.. మనోజ్ ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

Manchu Manoj-Bhuma Mounika: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది మొదట్లో భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం తర్వాత ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. లేకపోతే నేడు (అక్టోబర్ 4) మౌనిక రెడ్డి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మంచో మనోజ్ తన భార్యపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రియమైన మున్నిలు ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా నీపై నాకు ఉన్నటువంటి ప్రేమను ఇష్టాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నా జీవితంలో ప్రేమ వెలుగులను పంచినది నీవే. మన ఇద్దరినీ కలిపిన కాలానికి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. మా జీవితంలోకి వెలకట్టలేనంత సంతోషాన్ని తీసుకువచ్చావు. నువ్వు చూపించే ప్రేమ నాకు, నిస్వార్థమైనటువంటి నువ్వు చూపించే కేరింగ్ నేను మాటల్లో చెప్పలేను నువ్వు ధైరవ్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం

నీ మనసు ఎంత మంచిదంటే నీ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషంగా ఉండడానికి నీ ప్రేమను పంచుతావు వారి మొహాల్లో చిరునవ్వు చూస్తావు. నాకున్న కోరిక అంతా ఒకటే ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నీకు అంత మంచే జరగాలి మై లవ్ నీకు ఎప్పటికీ ఇదే ప్రేమను పంచుతూ ఉంటాను నీ ఆనందమే నాకు కావాల్సిన దానికోసం ఎక్కడికైనా వెళ్తాను.అంటూ ఈ సందర్భంగా మనోజ్ మౌనిక రెడ్డి పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -