Mohan Babu: భూమా మౌనిక విషయంలో మోహన్ బాబు అలా వ్యవహరించారా?

Mohan Babu: మంచు-భూమా ఫ్యామిలీ మధ్య సంబంధం ఏర్పడింది. చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు వేశారు. మంచు మనోజ్ ప్రేయసి భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేశారు. ఈ వివాహం మంచు మోహన్ బాబుకు ఇష్టంలేదని అందుకే వివాహానికి ఆయన హాజరయ్యే అవకాశాలు లేవని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు మోహన్ బాబు వివాహానికి హాజరై నూతన దంపతులకు తన దీవెనలు అందించారు.

అయితే మోహన్ బాబు దీవిస్తున్న సమయంలో భూమా మౌనిక రెడ్డి ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. రారు అనుకున్న పెళ్లికి ఆయనే పెద్దదిక్కుగా రావడం చూసి ఆమె ఎమోషనల్ అయిపోయారు. ఒక్కసారిగా మోహన్ బాబుని పట్టుకొని ఏడ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్ ఉంటే చాలా వైరల్ అవుతున్నాయి.

 

ఇకపోతే మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని కొన్నాళ్ళకి విడాకులు ఇచ్చారు. మరోపక్క భూమా మౌనిక రెడ్డి కూడా భూమా నాగిరెడ్డి కూతురుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తండ్రి ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ తో ఆమె వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వారిద్దరికీ కూడా విడాకులు అయ్యాయి. ఈ రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక రెడ్డి మధ్య సానిహిత్యం పెరిగి అది ప్రేమకు దారితీసింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -