Varun Tej-Lavanya Tripathi: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి నాగబాబు నో చెప్పారా.. పెళ్లికి ఒప్పించింది ఎవరంటే?

Varun Tej-Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఈ జంటకు సంబంధించి అనేక రకాల వార్తను వినిపించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడూ కూడా ఆ వార్తలపై స్పందించలేదు. దాదాపు 5 ఏళ్ళ నుంచి రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎప్పుడూ వారి విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ కనిపించకుండా బయట తిరుగుతూ బాగానే ఎంజాయ్ చేశారట. అయితే మరి ప్రేమ గురించి ఎన్ని వార్తలు వినిపిస్తున్న ఆ వార్తలపై స్పందించని లావణ్య, వరుణ్ తేజ్ ఏకంగా సడన్గా జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ వార్తలకు చెక్ పెట్టేశారు.

ప్రస్తుతం వరుణ్ వరుస సినిమాలతో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి రాజస్థాన్ లేదా వీరి ప్రేమ చిగురించిన ఇటలీలో కానుందని సమాచారం. అయితే ముందు మెగా ఫ్యామిలీ లావణ్య, వరుణ్ వివాహానికి అసలు ఒప్పుకోలేదట. నాగబాబు ఇండస్ట్రీలోని హీరోయిన్ లను కోడలుగా తెచ్చుకోవడానికి ఇష్టపడేవాడు కాదట. కానీ నిహారిక పట్టుపట్టి మరి వీరిద్దరి పెళ్లికి ఒప్పించిందట. ఇక నిహారిక నాగబాబు గారాల పట్టి కాబట్టి నాగబాబు కూతురి మాట కాదనలేక పెళ్లికి ఒప్పేసుకున్నాడట.

 

లావణ్య తనకి ముందు నుంచే ఫ్రెండ్ కావడంతో నిహారికకి తన వదినగా వస్తే చాలా బాగుంటుందని ఆలోచించి నిహారిక నాగబాబుని ఒప్పించింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే త్వరలోనే మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి అన్న సంగతి తెలిసిందే. పెళ్లి తేదీని ఇంకా ఫిక్స్ చేయలేదట.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -