Naga Babu Apology: నన్ను క్షమించండి అంటున్న మెగా బ్రదర్ నాగబాబు.. ఆ వ్యాఖ్యలు చేయడం తప్పంటూ?

Naga Babu Apology: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో భాగంగా హీరోల ఎత్తు గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పోలీస్ క్యారెక్టర్ అంటే 6.3 అంగుళాల ఎత్తు ఉన్న వారు పోలీస్ క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది కానీ ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండేవాళ్లు పోలీస్ క్యారెక్టర్లు చేస్తే పెద్దగా బాగుండదు అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా నాగబాబు పోలీస్ క్యారెక్టర్ చేసే హీరోల గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున ఈయనపై ట్రోల్స్ జరిగాయి. ఈయన ఎన్టీఆర్ ని ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో నాగబాబు వ్యాఖ్యలపై విమర్శలు కురిపించారు. ఇలా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ నెగిటివిటీ పై నాగబాబు స్పందించారు.

ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తాను అన్న మాటలకు బాధపడి ఉంటే క్షమాపణలు అంటూ క్షమాపణ లేఖ రాశారు. ఇటీవల నిర్వహించిన వరుణ్ బాబు ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకలో నేను పోలీస్ క్యారెక్టర్ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైనా ఆ మాటలకు బాధపడి ఉంటే ఐ యాం రియల్లీ సారీ అంటూ ఈయన క్షమాపణలు తెలియజేశారు.

నేను ఉద్దేశం పూర్వకంగా అలాంటి మాటలు మాట్లాడలేదని అది యాదృచ్ఛికంగా వచ్చిందని ఈయన వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని అందరూ గమనించి క్షమిస్తారని ఆశిస్తున్నాను.. మీ నాగబాబు అంటూ ఒక లేఖ విడుదల చేశారు. అయితే ఈ లేఖ పై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మాత్రం మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో అనే విషయాలని గుర్తించుకొని మాట్లాడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -