Brahmani-Balayya: బాలయ్య గురించి నారా బ్రాహ్మణి అలా చెప్పారా?

Brahmani-Balayya: తెలుగు తెర మీద కొంతమంది హీరోలను చూస్తే పూనకాలు వచ్చేస్తుంటాయి. కొంతమంది హీరోలు డ్యాన్సులు చేస్తుంటే అలాంటి ఫీలింగ్ కలుగుతుంది.. మరికొందరు హీరోలు డైలాగులు చెబుతుంటే పూనకాలు వస్తుంటాయి. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన డైలాగులతో అందరికీ పూనకాలు తెప్పించే సత్తా ఒక్క నందమూరి బాలయ్య బాబుకే సొంతం.

నందమూరి బాలయ్య సినిమా అనగానే అందరికీ ఆయన చెప్పే డైలాగులు గుర్తుకు వస్తుంటాయి. అయితే తాజాగా సంక్రాంతికి విడుదలై థియేటర్లలో ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ తెచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఫ్యాన్స్ కు ఒక రోజు ముందే సంక్రాంతి ఉత్సాహాన్ని బాలయ్య తన సినిమా ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెచ్చారు. కాగా ఈ సినిమాను బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారు.

 

తన తండ్రి నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నారా బ్రాహ్మణి.. థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని తన కోరిక అని, అది తీరిందని ఆమె చెప్పింది. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో డైలాగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయిన ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా ఉందని, ఎమోషన్ కూడా బాగా పండిందని నారా బ్రాహ్మణి వివరించింది.

 

డైలాగ్ డెలివరీలో తన తండ్రికి ఎవరూ సాటి లేరని బాలయ్య గురించి నారా బ్రాహ్మణి కితాబిచ్చింది. ఆయన లాగా డైలాగులు చెప్పే వాళ్లు ఎవరూ లేరని చెప్పుకొచ్చింది. సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశానని చెప్పిన బ్రాహ్మణి.. ఫ్యామిలీతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలన్నారు. అటు నారా మరియు నందమూరి కుటుంబాల తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నారా బ్రాహ్మణి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -