Hanuman: హనుమాన్ తో తేజ సజ్జా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడా?

Hanuman: ఇండియన్ తెలుగు సూపర్ హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. జనవరి 12న విడుదల కానున్న హనుమాన్ మూవీ ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. పలు చోట్ల ప్రీమియర్ షోలు పడగా హనుమాన్ మూవీ పై రివ్యూలు ఇస్తున్నారు ప్రేక్షకులు. 11 భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అయితే రివ్యూ చూసిన ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూ ని వెల్లడించారు.

 

ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైనర్ అందించాడని అన్నారు. కధ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్ బంప్స్ ఖాయమంటున్నారు ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని ఆదర్శ తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రానికి 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ని చూపే మైథాలజీని డైరెక్టర్ సమపాళ్లలో అద్భుతంగా మేళవించారు ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది ఈ సూపర్ హనుమాన్ మ్యాన్ కి ఆడియన్స్ ఫిదా అవుతారని చెప్పారు.

ఇక ఫైట్ సీన్స్ చూస్తే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయని సినిమా క్లైమాక్స్ అదిరిపోయిందని ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని రికమెండ్ కూడా చేశారు. హీరో తేజ సజ్జ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ అమాయకమైన బలహీనుడి పాత్రలో బాగా నటించారు తర్వాత హనుమంతుడు బలం తోడయ్యాక అతని నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటుంది.

 

అలాగే వర్స్ టైల్ యాక్ట్రెస్ అయినా వరలక్ష్మీ శరత్ కుమార్ మరొకసారి తనదైన మార్క్ చూపించారు. విలన్ పాత్రలో నటించిన వినయ్ రాయ్ నటన బాగుందని అలాగే వెన్నెల కిషోర్ ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఈ మూవీ ని హిందీలో చూసిన తరణ్ ఆదర్శ్ తన రివ్యూ ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -