Hanuman: హనుమాన్ పై ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

Hanuman: చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చి పెద్ద ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా హనుమాన్. పెద్ద పెద్ద సినిమాలతో పోటీపడి మరీ గెలిచిన చిత్రం హనుమాన్ ఈరోజుకీ కూడా కొన్ని థియేటర్లలో అదిరిపోయే బుకింగ్స్ తో ఈ సినిమా ప్రదర్శితం అవుతుంది. ఈ సందర్భంగా సినీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ హనుమంతుడి విగ్రహాన్ని తెరపై చూసిన సమయంలో అభిమానులు పిచ్చెక్కిపోతున్నారని ప్రశాంత్ వర్మ అన్నారు.

 

పవన్ లాంటి మాస్ హీరో సినిమా విడుదలైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెరపై హనుమంతుడిని చూసిన సమయంలో సైతం అలాగే పండగ చేసుకుంటున్నారని, హనుమంతుడిని చూస్తూ అలా అరుస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. 200 కోట్ల గ్రాస్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే దిశగా పరుగులు తీస్తుంది సినిమా. హనుమాన్ మూవీ అన్ని వర్గాల వారిని మెప్పించగా తేజ సజ్జ, ప్రశాంత వర్మ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. జై హనుమాన్ సీక్వెల్ మరింత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో తేజ సజ్జ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని సమాచారం అందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి కానీ హనుమాన్ మూవీ నుంచి ఎలాంటి అధికారిక ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. అలాగే ఈ సినిమాలో హనుమాన్ గా రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాని పెద్ద రేంజ్ లో తీస్తున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రశాంత వర్మ పారితోషికం సైతం భారీగా పెరిగినట్లు సమాచారం. చిన్న బడ్జెట్ సినిమా తీసినప్పుడే ప్రశాంత్ అద్భుతాలు సృష్టిస్తే బడ్జెట్ విషయంలో అతనికి ఫ్రీడమ్ ఇస్తే మరెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే జై హనుమాన్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -