Prabhas: ప్రభాస్ సంక్రాంతిని టార్గెట్ చేస్తే ఆ సినిమాలకు కష్టమేనా?

Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. క‌ల్కి, స‌లార్ 2తో పాటుగా రాజాసాబ్ కి కూడా వ‌రుస‌గా డేట్లు ఇస్తున్నాడు ప్ర‌భాస్. వీటిలో క‌ల్కి త‌న తొలి ప్రాధాన్య‌త‌. ఆ త‌రువాత స‌లార్ 2, రాజా సాబ్‌. ఈ సినిమాల విడుద‌ల మ‌ధ్య కూడా గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్ర‌భాస్‌. నిజానికి రాజా సాబ్ ఈ ఏడాదే రావాలి. కానీ స‌లార్ 2 వ‌ల్ల రాజా సాబ్ ఆల‌స్యం అవుతోంది.

 

స‌లార్ 2 కంటే రాజా సాబ్ ముందు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే 2025 సంక్రాంతికి రాజాసాబ్ మూవీని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేసుకుంటున్నారట. సంక్రాంతి బ‌రిలో ప్ర‌భాస్ సినిమా నిలిస్తే ఆ క‌ళే వేరుగా ఉంటుంది. పైగా రాజా సాబ్‌ పండ‌క్కి త‌గ్గ‌ట్టుగానే మారుతి క‌ల‌ర్‌ఫుల్ గా డిజైన్ చేస్తున్నాడు. ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌లో ప్ర‌భాస్ వింటేజ్ అవ‌తార్‌లో క‌నిపించాడు. మాస్ గా లుంగీ క‌ట్టుకొని ఫ్యాన్స్ ని మ‌రోసారి ఫిదా చేసేశాడు. రాజాసాబ్‌ పండ‌క్కి స‌రైన సినిమా అని మారుతి భావిస్తున్న‌ట్టు టాక్‌. సంక్రాంతి బ‌రిలో ప్ర‌భాస్ సినిమా నిలిచి కూడా చాలాకాలం అయ్యింది.

అందుకే రాజా సాబ్ ని పండ‌క్కే దింపాల‌ని చూస్తోంది టీమ్. ఇప్ప‌టికే చిరంజీవి, నాగ‌చైత‌న్య, శ‌ర్వానంద్ చిత్రాలు 2025 సంక్రాంతికి వ‌స్తున్నామంటూ ప్ర‌క‌టించుకొన్నాయి. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా కూడా చేరిపోయిన‌ట్టే. మరి వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద చిరంజీవితో పాటు ప్రభాస్ కూడా పోటీ పడబోతున్నాడు అన్నమాట. ఇది సూపర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -