Pawan: పవన్ పై ఇంత పగేంటి బాస్.. ఇంత కుట్రకు తెర లేపారా?

Pawan: నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. కాగా పూనమ్ కౌర్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా వివాదాల ద్వారానే బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా తరచు వివాదాల్లో ఎక్కువగా నిలిచే హీరోయిన్ లలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా సమాజంలో జరిగే విషయాలుపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పొగిడినట్టుగా, మరి కొన్నిసార్లు తిట్టినట్టుగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ ఉంటుంది.

ఎప్పుడు పవన్ ని ఏదో ఒక విషయంలో టార్గెట్ చేస్తూ పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అచ్చం పూనమ్ కౌర్ మాట్లాడినట్టుగానే ఒక ఆడియో తెగచక్కర్లు కొడుతోంది. కాగా ఆడియోలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది పూనమ్ కౌర్. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.. నేను నోరు మూసుకున్నా పవన్‌ కళ్యాణ్‌ను చంపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆయన చాలామంది అమ్మాయిలతో తప్పు చేశారు. నా విషయంలో జరిగింది నేను ఫ్రూఫ్‌లు చూపిస్తే పవన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు. నేను ప్రేమించాను కాబట్టి బయటకు రాలేదు.

 

నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పవన్ వల్ల నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది అని పూనమ్ కౌర్ గొంతును పోలిన ఒక వాయిస్ రికార్డ్‌ను వైసీపీ అనుకూల వర్గాలు షేర్ చేస్తున్నాయి. అయితే ఆ వాయిస్ నిజంగానే పూనమ్ కౌర్‌దా కాదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇది ఫేక్ అని జనసేన వర్గాలు అంటున్నాయి. అంతేకాదు పవన్‌ను చంపడం అనే మాట చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందని పవన్‌కు ప్రాణ హాని ఉందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన వారాహి యాత్రను ఆపేయడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా వైసిపి చేస్తూ ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -