Jagan: జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఏపీ ప్రజలు తప్పు చేశారా.. ఏమైందంటే?

Jagan: పవన్, పురందేశ్వరి, షర్మిల.. ఇలా ఎవరు వైసీపీని విమర్శించినా.. వారంతా చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లేనని జగన్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ వెనక చంద్రబాబు, కాంగ్రెస్ వెనక చంద్రబాబు, కోర్టుల్లో చంద్రాబాబు, సీబీఐ నిర్ణయాల వెనక చంద్రబాబు… ఇలా మాటకు ముందు, మాట తర్వాత చంద్రబాబు పేరు లేకుండా జగన్ ప్రసంగం ఉండటం లేదు. ఇదే వైసీపీ కొంప ముంచుతుందేమోనని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

 

వైసీపీ నేతల ఆందోళనలో కూడా నిజం లేకపోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ అనుకూల మీడియా జగన్ పై కూడా ఇలాగే ప్రచారం చేసింది. అలా వారికి తెలియకుండానే జగన్ ఇమేజ్ పెంచింది. దాని ఫలితం 2019 ఎన్నికల్లో క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు జగన్ కూడా అదే తప్పు చేస్తున్నారు. అవసరం ఉన్నా.. లేకపోయినా.. చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఆయనకు తెలియకుండానే చంద్రబాబు తరుఫున ప్రచారం చేస్తున్నారు. జగన్ స్టైల్ లో చెప్పాలంటే.. చంద్రబాబుకి అందరికంటే పెద్ద స్టార్ క్యాంపెయినర్ గా మారిపోతున్నారు. ఇది వ్యూహాత్మిక తప్పిందం.

ప్రజలు వినడం మాత్రమే కాదు.. విన్న మాటల్లో నిజం ఎంత ఉందో కూడా ఆలోచిస్తారు. షర్మిల వెనక చంద్రబాబు ఉన్నారనే అంశాన్ని ఎవరూ అంగీకరించరు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ కోసం షర్మిల పని చేసినపుడు కూడా చంద్రబాబు ఆదేశాలతో చేశారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి జగన్ సమాధానం చెప్పాలి. వివేకా హత్యకేసు వెనక కూడా చంద్రబాబు కుట్ర ఉందని గత ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, అందులో నిజాలేంటో ఇప్పుడిప్పుడే అందరికి అర్థం అవుతున్నాయి. ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో జగన్.. చంద్రబాబు ప్రస్తావన తీసుకొని రారు. ఎందుకంటే ఈ విషయాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు.

 

అలాగే షర్మిల విషయంలో కూడా అంతే. జగన్, షర్మిలకు ఆస్తి గొడవలు ఉన్నాయని జగమెరిగిన సత్యం. ఈ గొడవల్లో భాగంగానే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, దాన్ని చంద్రబాబుకి లింక్ పెట్టి ప్రచారం చేస్తే టీడీపీకి వచ్చిన నష్టం ఉండదు. పైగా.. ప్రతీ విషయంలో కార్నర్ చేయడంతో చంద్రబాబుకు కాస్తో.. కూస్తో సింపతీ పెరుగుతుంది. ఇలా చంద్రబాబు కోసమే జగన్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన చెందడాన్ని కొట్టి పారేయలేం. కానీ, పార్టీ నేతలు ఎవరూ జగన్ దగ్గర మాట్లాడే పరిస్థితి లేదు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -