Bandi Sanjay: ఆ రీజన్ వల్లే బండి సంజయ్ ఫోన్ ను పోలీసులు తీసుకున్నారా?

Bandi Sanjay: బండి సంజయ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారారు. టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ అవడంతో బండి సంజయ్ హస్తం ఉంది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఈయన ఆరోపణలను ఎదుర్కోవడంతో పోలీసులు తనని అరెస్టు చేయడం బెయిల్ పై బయటకు రావడం జరిగింది. అయితే తాజాగా బండి సంజయ్ తన ఫోన్ పోలీసులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది.

బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి తర్వాత తనను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన తన మొబైల్ ఫోన్ ఉపయోగించారు అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే ఇప్పుడు బండి సంజయ్ తన ఫోన్ పోలీసులు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.సాధారణంగా ఒక వ్యక్తి అరెస్టు అయినప్పుడు ముందుగా అతని ఫోన్ పోలీసుల స్వాధీనం చేసుకుంటారు..

బండి సంజయ్ విషయంలో ఆయన అరెస్టయి బయటకు వచ్చిన ఫోన్ తన వద్దనే ఉంది.కానీ ప్రస్తుతం పోలీసులు తన ఫోన్ స్వాధీనం చేసుకున్నారని అందులో చాలా విలువైన సమాచారం దాగి ఉందని ఈయన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది తనకు ఫోన్లు చేసి మాట్లాడారని ఆ విషయాలన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయని ఈయన ఆరోపణలు చేశారు. ఇక ఈ విషయం తెలిసిన కెసిఆర్ కు వణుకుడు మొదలైందని బండి వెల్లడించారు.

ఇలా తన ఫోన్ బయటకు వస్తే అన్ని విషయాలు బయటపడతాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఫోన్లో చాలా విలువైన సమాచారం ఉంటుందని ఈయన తెలిపారు. ప్రత్యర్థులకు కావాల్సిన సమాచారం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వార్ రూమ్ పై సీఐడీ పోలీసులు ఎటాక్ చేసి సునీల్ కనుగోలు వ్యూహాలన్నీ తీసుకెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే ఇప్పుడు అదే పద్ధతిలో బండి సంజయ్ తన వ్యూహాలను రచిస్తున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -