Hero Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ రాముడి పాత్రలో కనిపించనున్నారా?

Hero Ram Charan: హనుమాన్ సినిమా.. చిన్న సినిమాగా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.అయితే ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం లాంగ్ రన్‌లో ఇక్కడ, ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అని తెలుస్తోంది. కాగా ఈ సినిమా క్లైమాక్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను 2025 లో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే హనుమాన్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించాడు. అంటే హనుమాన్ మూవీలానే మరిన్ని సూపర్ హీరో చిత్రాల్ని ఒక ఫ్రాంచైజీలో భాగంగా రిలీజ్ చేస్తారు. తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ ఉన్నట్లు రాబోయే చిత్రాల్లో మన దేవుళ్ల రిఫరెన్సులు ఉండటం పక్కా అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ మొదలయ్యాయి. మెగాహీరో రామ్ చరణ్.. ఆ పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని సెకండాఫ్‌లో చరణ్ గెటప్ గుర్తుచేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ ఆ వార్తలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో రాముడి పాత్ర ఎవరికీ సూట్ అవుతుంది అంటే రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ చరణ్ గనుక ప్రశాంత్ వర్మ తీసే సినిమాలో రాముడి పాత్ర వేస్తే మాత్రం అది వేరే లెవల్ మూవీ అని చెప్పవచ్చు. మరి ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -