Skanda: బోయపాటి శ్రీను ఖాతాలో మరో ఫ్లాప్ అంటున్న నెటిజన్లు.. స్కంద ట్రైలర్ చెత్తగా ఉందంటూ?

Skanda: బోయపాటి శ్రీను టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం స్కంద. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల నిమిషం తెలిసిందే.. ఎన్నో ఆశల నడుమ విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఊహించని విధంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా ఈ సినిమా ట్రైలర్ ను చూసిన తర్వాత నెటిజన్స్ బోయపాటి తెరకెక్కించిన సినిమాలన్నింటిలోనూ ఒక్కో ముక్క తీసి, కట్ చేసి కలిపితే చూసిన ఫీలింగ్ వచ్చిందన్నది నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ లో కొత్త దనం అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. ఇందులో రామ్ పోతినేని స్టైల్ కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో స్టైల్ లాగే అనిపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పాజిటివ్ గా దీన్ని తీసుకున్నవారు కూడా వున్నారు. బోయపాటి మాస్ స్టయిల్ మరింత పదును తేలిందని, ఊచకోత, నరుకుడు మరింత బలంగా వున్నాయని, పవర్ ఫుల్ మాస్ డైలాగులు పడ్డాయని అన్నవారు కూడా వున్నారు. ఆ సంగతి అటు ఉంచితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో అస్సలు కథ రివీల్ చేయలేదు. ఫ్యామిలీ స్టోరీ వుందా? రామ్ డబుల్ రోల్ చేసాడా? అన్న చిన్న చిన్న పాయింట్లు తప్ప మరేం లేదు. అలాగే హీరోయిన్ శ్రీలీలకు కూడా గొప్ప పాత్ర ఏమీ వున్నట్లు కనిపించలేదు.

 

కానీ ఇప్పుడు ఈ సినిమాకు కావాల్సింది అదే. బలమైన కథ వుండాలి. ఎందుకంటే రామ్ రొటీన్ యాక్షన్, బోయపాటి రొటీన్ సీన్లు, డైలాగులు ఇవన్నీ కలిసి సీన్లు పండించాలంటే బలమైన కథ వుండాలి. ఆ విషయం ట్రయిలర్ లో చెప్పలేదు సినిమాలో చెబుతారేమో చూడాలి మరి. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ను చూసిన నెటిజన్స్ బోయపాటి ఖాతాలో మరో ఫ్లాప్ సినిమా ఖాయం. ట్రైలర్ పరమ చెత్తగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల ఎటువంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -