Upasana: తన కూతురు గురించి ఉపాసన అలాంటి కామెంట్లు చేశారా?

Upasana: గతవారం అంతా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే వార్త నడించింది. పెద్ద పరియటం చేయాల్సిన అవసరం లేని వార్త. అదే ఉపాసన-రామ్ చరణ్ కపుల్స్ కి పాప పుట్టడం. ప‌ద‌కొండేళ్ల బంధం తర్వాత ఈ జంటకు పాప పుట్టింది. ఇటు ఉపాసన, అటు మెగా ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా ఈ శుభవార్త కోసం వెయిట్ చేసింది. చివరికి ఈ నెల 20న నెరవేరింది. అయితే ఈ ఇన్సిడెంట్ పై ఇన్ట్రెంగ్ కామెంట్స్ చేశారు ఉపాసన.

 

తెలుగు ఇండస్ట్రీలో అత్యంత అన్యోన్యంగా ఉండే జంటల్లో రామ్ చరణ్-ఉపాసన జంట ఒకటి. ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, ఉపాసన ఒదిగే ఉంటుంది. ఎక్కడా హుందాతనాన్ని చూపించుకోదు. భర్త అంత పెద్ద హీరో అయినా ఆ దర్పం ఉపాసనలో కనిపించదు. డెలివరీ అనంతరం హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి వెళ్లే ముందు జూన్ 23న ఇద్దరు చాలా చక్కగా ప్రెస్ కు వివరాలు చెప్పి వెళ్లారు. తమకు పుట్టిన బిడ్డను మీడియాకు చూపించారు.

రామ్‌చ‌ర‌ణ్-ఉపాస‌న దంప‌తులు హాస్పిట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోన్న వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. ఇక త‌న చేతిలో బిడ్డ‌ను ఇచ్చి ఉపాస‌న‌ని పంపిపించిన చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. డాక్ట‌ర్లు తీసుకున్న కేర్‌తో పాటు అభిమానుల ప్రార్ధ‌న‌ల వ‌ల్ల ఉపాస‌న‌తో పాటు కూతురు క్షేమంగా ఉన్న‌ట్లు రామ్‌చ‌ర‌ణ్ చెప్పుకొచ్చారు.

 

ఇంటికి వెళ్లిన అనంతరం ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. తాను బుల్లి చ‌ర‌ణ్ పుడ‌తాడ‌ని బావించిన‌ట్టు ఉపాస‌న పేర్కొంది. అయితే త‌న‌కు బుల్లి అత్త‌మ్మ పుట్ట‌డం ప‌ట్ల కూడా సంతోషం వ్య‌క్తం చేసింది. ఇక ఇప్ప‌టికే చ‌ర‌ణ్ తాను ఒక పేరు ఫిక్స్ అయిన‌ట్టు చెప్పిన ఉపాస‌న 21వ రోజు రివీల్ చేస్తామ‌ని తెలియ‌జేసింది. త్వ‌ర‌లో మెగా ప్రినెన్స్ పుట్టిన సంద‌ర్భంగా ఓ భారీ పార్టీ ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -