Pushpa2: పుష్ప2 సినిమాలో ఆ దేవతను అవమానించారా.. ఏమైందంటే?

Pushpa2: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం పుష్ప2. ఇప్పటికే పుష్ప 1విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ విడుదల అయినా కూడా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. పుష్ప2 సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన లుక్ ని అలాగే టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన టీజర్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వీటి గురించే చర్చించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప2 సినిమా టీజర్ 5 భాషల్లో విడుదల కాగా ఎక్కువగా హిందీలో వ్యూస్ ని రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సంగతి పక్కన పెడితే పెడితే అల్లు అర్జున్ పుష్ప రాజ్ అమ్మ వారి గెటప్ లో కనిపించిన పోస్టర్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

అయితే అమ్మవారి గెటప్ లో ఉన్న పుష్పరాజ్ చేతిలో తుపాకీ పట్టుకోవడంపై బాలీవుడ్ ట్విట్టర్ పేజీ లో విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలకు బన్నీ ఫ్యాన్స్ కూడా ధీటుగా బదులిస్తున్నారు. శత్రు సంహారం చేయడానికి ఎంతోమంది దేవతలు, దేవుళ్లు ఆయుధాలను పట్టారని ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప2 సినిమాలో కూడా శత్రు సంహారం కోసమే గన్ పట్టాడని అభిమానులు చెబుతున్నారు. ఒక ప్రాంత ఆచారాన్ని ఆ పోస్టర్ లో చూపించారని ప్రతిదీ వివాదం చేయొద్దని బాయ్ కాట్ అంటూ కామెంట్లు చేసినా పుష్ప ది రూల్ పై ఆ ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -